గాల్లో తేలుతూ టీవీ చూస్తూ,చిప్స్ తింటూ.....

కొంత మందికి కొన్ని కోరికలు ఉంటాయి,అయితే వారి కోరికలను నెరవేర్చుకోవడం లో కొందరు సక్సెస్ అవుతూ ఉంటారు, మరికొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు.టర్కీ కి చెందిన పారా గ్లయిడర్ హాసన్ కావల్ కు కూడా ఒక బలమైన కోరిక ఉండేదట.

 Flying Couch Potato Paragliding, Flying Couch, Paragliding, Turkey, Para Glider-TeluguStop.com

అయితే తనకున్న ఆ కోరికను తీర్చుకోవడం లో అతగాడు సక్సెస్ అయ్యాడు.దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

ఇంతకీ కావల్ కు ఉన్న ఆ బలమైన కోరిక ఏంటో తెలుసా.గాల్లో ఎగురుతూ టీవీ చూస్తూ స్నాక్స్ తినాలని.

అందుకే తన కోరిక కొంచం కష్టం అయినా కానీ నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమ పడి తన కోరికను తీర్చుకున్నాడు.నిజంగా పారాచ్యుట్ సాయం తో గాల్లోకి ఎగరాలి అంటేనే ఒకింత భయం కలుగుతుంది.

కానీ కావల్ మాత్రం సోఫా సెట్,టీవీ తో సహా గాల్లోకి ఎగిరి హ్యాపీ గా టీవీ చూస్తూ ఎంజాయ్ చేశాడు. గాల్లో కి పారాచ్యుట్ ఎగరగానే ఎలాంటి భయం లేకుండా కాళ్ల కు ఉన్న షూ లను మార్చుకొని తాపీ గా బ్యాగ్ లో తెచ్చుకున్న స్నాక్స్ తీసి తింటూ టీవీ లో టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఎంజాయ్ చేశాడు.

ఈ క్రమంలోనే తన సెల్ఫీ వీడియో తీసి దానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అయితే ఫిదా అయిపోతున్నారు.

ఇలా కూడా టీవీ చూడొచ్చా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరికొందరు అయితే అతడి ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు.

నిజంగా గాల్లో తేలుతూ ఇలా టీవీ చూస్తూ,స్నాక్స్ తింటూ ఎవరైనా ఇంతగా ఎంజాయ్ చేయగలరా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.మొత్తానికి కావల్ తనకున్న కోరికను తీర్చుకొని చాలా హ్యాపీ గా ఫీలవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube