వావ్.. ఈ కారు రోడ్డు మీద నుండి డైరెక్ట్ గా గాల్లోకి ఎగురుతుందట !

కొన్ని విషయాలు తెలుసు కున్నప్పుడు ఆశ్చర్యంతో పాటు వాటిని వెంటనే నమ్మలేము కూడా.కొన్ని విషయాలు అలాగే ఉంటాయి నమ్మలేని విధంగా ఏదో కలలాగా ఉంటాయి.

 Flying Car Takes Successful Inter-city Test Run, Stefan Klein, Klein Vision, Fly-TeluguStop.com

అవి నమ్మలేనంత మాత్రాన నిజాలు కాకుండా పోవు.ఇప్పుడు మనం చెప్పుకో బోయే విషయం కూడా అలానే ఉంటుంది.

ఇలాంటివి మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూసాం.కానీ నిజ జీవితంలో ఇలాంటివి ఇంత వరకు చూడలేదు.

మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో కొత్త కొత్త వారిని ఆవిష్కరిస్తూనే ఉన్నారు.ఇప్పుడు రోడ్డు మీద నుండి నేరుగా గాల్లోకి వెళ్లే కారును కూడా తయారు చేసారు.ఎప్పటి నుండో ఎగిరే కార్లపై ప్రయోగం జరుగుతూనే ఉన్నాయి.ఇన్ని రోజులకు ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది.

అంతేకాదు ఈ కారును విజయ వంతంగా ప్రదర్శించడం కూడా అయ్యింది.

ఎయిర్ కార్ సంస్థ ఎప్పటి నుండో ఎగిరే కార్లపై ప్రయోగాలను చేస్తూ ఉంది.ఆ ప్రయోగాలు ఇన్ని రోజులకు విజయవంతం అయ్యాయి.స్లోవాకియా విమానాశ్రయంలో జూన్ 28 న ఈ కారును విజయ వంతంగా ప్రదర్శిస్తారు.

విమానాశ్రయం నుండి స్టార్ట్ అయినా ఎయిర్ కార్ 32 నిముషాలు గాలిలో ఎగిరి ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ఈ కారు వ్యవస్థాపకుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఈ కారును ఆ కారు తయారు చేసిన వ్యవస్థాపకుడు క్లయిన్ స్వయంగా నడిపాడు.ఈ ఎయిర్ కార్ ను బీఎండబ్ల్యూ ఇంజిన్ తో తయారు చేసిన సాధారణ పెట్రోల్ కారు లాగానే పని చేస్తుందని తెలిపారు.ఇది 1000 కిలోమీటర్ల దూరం వరకు ఎగురు తుందట.

ఈ ఎయిర్ కార్ కారు నుండి విమానంగా మారడానికి 15 సెకన్లు చాలని ఆయన తెలిపారు.ఇది 8,200 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మీరు కూడా ఈ అద్భుత వీడియోను ఒకసారి లుక్ వెయ్యండి.

మీకు కూడా బాగా నచ్చుతుంది.

https://youtu.be/a2tDOYkFCYo

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube