అతడి జోక్‌ కారణంగా 16 గంటలు రన్‌ వే పైనే నిలిచి పోయిన విమానం.. ఇంతకు ఆ జోక్‌ ఏంటంటే..!

కొన్ని సార్లు జోక్‌ చేస్తే సీరియస్‌ అవుతుంది.ఆ తర్వాత అది జోక్‌ అని చెప్పినా కూడా ఎవరు నమ్మే అవకాశం ఉండదు.

 Flyer Jokingly Mentions Gun Flight Delayed By 16 Hours-TeluguStop.com

జోక్‌ చేయడం వల్ల ఎంతో మంది ఇబ్బందులకు గురవ్వడం లేదంటే అవతలి వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి.చిన్న అబద్దం లేదా జోక్‌ వల్ల ఎంత పెద్ద అనర్థం జరుగుతుందో ముందే ఊహించలేని కారణంగా కొందరు పదే పదే అలాంటి తప్పులు చేస్తూ ఉంటారు.

తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో ఒక వ్యక్తి చేసిన జోక్‌ కారణంగా 16 గంటల పాటు ఒక విమానం నిలిచి పోవడంతో పాటు, అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బెంగళూరు నుండి సింగపూర్‌కు వెళ్తున్న ఒక విమానంలోకి జనాలు అంతా ఎక్కారు.

విమానం టేకాఫ్‌కు మరి కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది.ఆ సమయంలోనే విమానంలోని ఒక ప్రయాణికుడు తన బ్యాగ్‌లో గన్‌ ఉందంటూ చెప్పాడు.దాంతో అందరు కూడా కంగారు పడ్డారు.విమాన సిబ్బంది వెంటనే అతడి బ్యాగ్‌ను చెక్‌ చేయడం జరిగింది.

మరో వైపు ఎయర్‌ పోర్ట్‌ పోలీసులకు కూడా విమాన సిబ్బంది సమాచారం ఇవ్వడం జరిగింది.వెంటనే ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది విమానంలోకి ఎక్కి అతడిని అదుపులోకి తీసుకుని వెంటనే అతడిని ఎంక్వౌరీ రూంకు తీసుకు వెళ్లాడు.

చాలా సేపు అతడు ఏం మాట్లాడలేదు.

విమానాశ్రయ పోలీసులు అతడిపై చేయి చేసుకున్న తర్వాత నేను జోక్‌ చేశాను, నా బ్యాగ్‌లో గిటార్‌ ఉంది, దాన్ని ఎయిర్‌ హోస్టస్‌కు గన్‌ అంటూ చెప్పాను, అంతే తప్ప నా వద్ద గన్‌ లేదు అన్నాడు.

అయినా కూడా అతడిని వదలకుండా అన్ని విషయాలు అతడి గురించి తెలుసుకుని, స్థానికంగా అతడు ఎక్కడ ఉంటాడు, అతడి వివరాలు అన్ని తెలుసుకుని, నేర చరిత్ర ఏమైనా ఉందా అనే విషయాలను తెలుసుకున్నారు.అతడు జోక్‌ చేశాడని చెప్పి విమానం టేకాఫ్‌ చేసేందుకు ప్రయత్నించినా కూడా ప్రయాణికులు మాత్రం ఒప్పుకోలేదు.

పూర్తిగా తేలే వరకు విమానం టేకాఫ్‌ అవ్వొదు అంటూ భీష్మించారు.దాంతో 16 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత, సోదాల తర్వాత విమానంలో ఏమీ లేదని నిర్ధారించుకుని అప్పుడు టేకాఫ్‌కు సిద్దం అయ్యింది.అర్ధరాత్రి 1.30 గంటలకు వెళ్లాల్సిన విమానం, సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్‌ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube