చెవినొప్పితో బాధపడింది...చివరికి డాక్టర్లు ఆమె చెవిలోనుండి ఏం తీశారో తెలుస్తే ఆశ్చర్యపోతారు.!

మాయ‌దారి ఈగ‌లు.ప‌డుకుంటే చెవుల దగ్గ‌ర హోరు పెడ‌తాయి.

 Fly Larva Crawls Inside Womans Ear-TeluguStop.com

ఏదైనా తింటుంటే ఆహారాల‌పై వాల‌తాయి.ఈ క్ర‌మంలో అవి క‌లిగించే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

చాలా విసుగు వ‌స్తుంది.మ‌రో వైపు అవి వాలిన ఆహారాల‌ను తింటే దాంతో మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లుగుతాయి.

ఇది స‌రే.అస‌లు ఇప్పుడీ ఈగ‌ల గోల అంతా ఎందుకు.? అని అడ‌గ‌బోతున్నారా.? అయితే మీరు అడుగుతున్న‌ది క‌రెక్టే.కానీ.ఇప్పుడు వాటి గురించి చెప్పాల్సిందే.అదీ ముఖ్యంగా మ‌నం నిద్రించేట‌ప్పుడు ఈగ‌లు మ‌న చెవిలోకి పోకుండా జాగ్ర‌త్త ప‌డాలి.లేదంటే కింద చెప్పిన‌ట్టుగా రెండు సంఘ‌ట‌న‌ల్లోలా మీకు జ‌ర‌గ‌వ‌చ్చు.

ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

చైనాలో 70 ఏళ్ల వ‌య‌స్సున్న ఓ మ‌హిళ చెవిలోకి ఈగ దూరింది.దీంతో అది నొప్పిని క‌ల‌గ‌జేసింది.

అయితే ఆ నొప్పి గురించి ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పింది.కానీ వారు వృద్ధురాలు అని చెప్పి ఆమె మాట‌ను ప‌ట్టించుకోలేదు.

సాధారణంగా అంద‌రిలాగే ఆమె కూడా నిరాద‌ర‌ణ‌కు లోనైంది.దీంతో ఆమె స‌మ‌స్య‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

అయితే రాను రాను చెవిలో ఆ నొప్పి ఎక్కువ కాసాగింది.దీంతో ఆమె ఇంట్లో త‌మ స‌మ‌స్య‌ను చెప్పుకోగా ఎట్ట‌కేల‌కు వారు ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించారు.

ఈ క్ర‌మంలో వైద్యులు ఆమె చెవిని ప‌రీక్షించి చూడ‌గా ఈగ‌లు ఆమె చెవిలో గుడ్లు పెట్టి పిల్ల‌ల్ని పొదిగిన‌ట్టు తెలిసింది.దీంతో డాక్ట‌ర్లే షాక్ అయ్యారు.

త‌రువాత ఎలాగో స‌ర్జ‌రీ చేసి ఆమె చెవిలో ఉన్న ఈగ‌ల‌ను, గుడ్ల‌ను తొల‌గించారు.దీంతో ఆమె నొప్పి క్ర‌మంగా త‌గ్గిపోయింది.

అయితే స‌రిగ్గా పైన చెప్పిన లాంటిదే ఓ సంఘ‌ట‌న మ‌న దేశంలోనూ జ‌రిగింది.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నివాసం ఉండే ఓ 4 ఏళ్ల బాలిక చెవిలోకి కూడా ఈగ దూరి అది ఏకంగా 80 గుడ్ల‌ను పెట్టింది.దీంతో బాలిక నొప్పి అని బాధ‌ప‌డుతుండ‌గా ఆమె తల్లిదండ్రులు హాస్పిట‌ల్‌లో చేర్పించారు.దీంతో అస‌లు విష‌యం తెలిసింది.కాబ‌ట్టి చూశారుగా.మీరు నిద్రించేట‌ప్పుడు చెవి విష‌యంలో జాగ్ర‌త‌గా ఉండండి.

అందులో ఈగ అనే కాదు, దోమ లేదా వేరే ఏ పురుగు దూరినా ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది.కాబ‌ట్టి జాగ్ర‌త్త‌.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube