ఆకాశంలో విందు భోజనం,కావాలంటే ట్రై చెయ్యొచ్చు  

Fly Dinning Restaurant In Noida-noida,sky Fly Food,waiter Comes In Sky Dinning And Order The Food

ఆకాశంలో విందు భోజనం ఏంటి అని అనుకుంటున్నారా.నిజంగా ఇలాంటి విందు భోజనాలు కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా.ఇలాంటి ఆకాశంలో విందు భోజనం అందించే రెస్టారెంట్ మన దేశంలోనే ఉందంటే మీరు నమ్మగలరా.నిజంగా ఇది నిజం ఇలాంటి విందు భోజనం అందించే రెస్టారెంట్ నోయిడా లో ఉంది.

Fly Dinning Restaurant In Noida-noida,sky Fly Food,waiter Comes In Sky Dinning And Order The Food-Fly Dinning Restaurant In Noida-Noida Sky Food Waiter Comes Sky And Order The

భారీ డైనింగ్ టేబుల్ తో మొత్తం 24 మంది కూర్చొనే విధంగా దీనిని రూపొందించారు.నిజంగా భోజనం చేయడం లో కూడా కిక్ ని వెతుక్కునే వారికి ఈ రెస్టారెంట్ బాగా ఉపయోగపడుతుంది.ఈ డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీ లో కూర్చున్న తరువాత 160 అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లి అప్పుడు అక్కడ సర్వ్ చేస్తారు.నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దానిని ఊహించుకుంటే మాత్రం కాళ్లల్లో వణుకు మొదలవుతుంది.

Fly Dinning Restaurant In Noida-noida,sky Fly Food,waiter Comes In Sky Dinning And Order The Food-Fly Dinning Restaurant In Noida-Noida Sky Food Waiter Comes Sky And Order The

అంత ఎత్తులోకి వెళ్లిన తరువాత భోజనం పై దృష్టి పెడతామా,లేదంటే అంత ఎత్తునుంచి కిందకు చూసి భయపడతామా అన్నది మీ మీదే ఆధారపడి ఉంటుంది.160 అడుగుల ఎత్తులో ఆకాశంలో డిన్నర్ చేసే అవకాశం లభిస్తుంది.ఈ భారీ డైనింగ్ టేబుల్‌కి 24 కుర్చీలు ఉంటాయి.మధ్యలో వెయిటర్ అటూ ఇటూ తిరగడానికి కొంచెం దారి ఉంటుంది.24 సీట్లు ఫుల్ అయిన తర్వాత ఆ డైనింగ్ టేబుల్‌‌ను ఓ క్రేన్ సాయంతో పైకి తీసుకుని వెళ్తారు.160 అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాక.ఫుడ్ సర్వ్ చేస్తారు.వాస్తవానికి ఈ ఆకాశంలో విందు భోజనం అనే కాన్సెప్ట్ దుబాయ్ లో ఉండేదట.నిఖిల్ కుమార్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఆకాశంలో విందు భోజనం అందించే విధానాన్ని చూశాడు.

దానితో ఇండియా లో కూడా ఇలాంటి రెస్టారెంట్ ను ప్రారంభించాలి అని ఆలోచన రావడం తో మరి దానిని కార్యరూపం దాల్చాడు.ముఖ్యంగా కస్టమర్ల భద్రత విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలి.అందుకోసం క్రేన్‌ను దుబాయ్ నుంచి తీసుకొచ్చారు.జర్మనీ ఇంజనీర్లు కొన్ని నెలల పాటు ఇండియాలో ఉండి, ఇక్కడి వారికి శిక్షణ ఇచ్చి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

భద్రతా పరంగా అంతా పర్‌ఫెక్ట్‌గా ఉందని భావించిన తర్వాతే ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది.