కిడ్నీలు శుభ్రంగా ఉంచుకునే మార్గాలు మీకోసం  

కిడ్నీలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అందుకే ప్రమాదాల బెడద ఎక్కువ వాటికి. టాక్సిన్స్ ఎక్కువగా దాడి చేసేది కిడ్నీలనే. కిడ్నీలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతేనే కిడ్నీ ఫేల్యూర్ సమస్యలు, ఇన్ఫెక్షన్ సమస్యలు, కిడ్నీల్లో రాళ్ళు వస్తాయి. కాబట్టి కిడ్నీలను శుభ్రం చేసుకోవాలి ? ఎలా అంటారా ?

* ఆపిల్ సీడెడ్ వెనిగర్ ని ఏ డాక్టర్ అయినా నిర్మొహమాటంగా సజెస్ట్ చేస్తాడు. అలాంటి శక్తివంతమైన పదార్థం ఇది. దీనికి నేచురల్ క్లీన్సేనర్ అనే పేరు కూడా ఉంది. గ్లాసు నీటిలో ఓ రెండు టీస్పూను ఆపిల్ సీడెడ్ వెనిగర్ కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే బాడిలో టాక్సిన్స్ ని బయటకి లాగవచ్చు.

* ఉదయాన్నే నిమ్మరసం తాగే అలావాటు చేసుకున్న మంచిదే. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది.

* పైనాపిల్, ఆపిల్, ఆరెంజ్, పీచ్ తో కలిపి చేసిన జ్యూస్ కూడా బాగా పనికివస్తుంది.

* పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, పార్స్లీ ఆకులు, కాలే, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే దీన్ని సేవించడం వందరకాలుగా ఉపయోగం.

* బీట్ రూట్ లో పొటాషియం బాగా ఉంటుంది. ఇది మలీనాల్ని ఈజీగా బయటకి తెస్తుంది. కాబట్టి బీట్ రూట్ ని ప్రేమించండి.

* క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కాని చక్కర కలపకుండా తాగండి.