వైరల్: వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. నాటితే మొలకలు రావడమే కాకుండా ఆపై పూలు కూడా..!  

ఇప్పటివరకు మనం ఎన్నో రకరకాల వెడ్డింగ్ కార్డు చూసే ఉంటాం.చాలామంది వారి స్థాయిని తెలిపేందుకు గుర్తుగా ఈ వెడ్డింగ్ కార్డు ని సెలెక్ట్ చేసుకొని శుభకార్యాలకు పిలుస్తూ ఉంటారు.

TeluguStop.com - Flowers Seeds In Wedding Card Ap Commissioner Sajjanar

ఈ ఆలోచన లో భాగంగా సివిల్స్ అధికారి తమ వెడ్డింగ్ కార్డు మాత్రం కాస్త వెరైటీ గా డిజైన్ చేయించారు.ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారి స్టైల్ లో వినూత్న కార్డును డిజైన్ చేయించారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ సివిల్స్ అధికారి శశికాంత్ విత్తనాలతో ఉన్న వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేయించారు.

TeluguStop.com - వైరల్: వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. నాటితే మొలకలు రావడమే కాకుండా ఆపై పూలు కూడా..-General-Telugu-Telugu Tollywood Photo Image

తన ఆలోచనలకు తగిన విధంగా ఆగ్రాలోని ఓ కంపెనీ ద్వారావిత్తనాల వెడ్డింగ్ కార్డు ఆయన తయారుచేయించి శభాష్ అనిపించుకున్నారు.తన జీవితంలో మధురమైన ఘట్టాన్ని ఆరంభించే ప్రక్రియలో భాగంగా ఓ వినూత్న ఆలోచనలకు ఆయన దారి చూపాడు.

ఇందులో భాగంగానే ఆయన కూరగాయలు, పూల విత్తనాలతో కలిసి ఉన్న పెళ్లి పత్రికలు తయారుచేయించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.వెడ్డింగ్ కార్డు ను మొత్తం నీటిలో నానబెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మట్టిలో వేస్తే అందమైన విత్తనాలు మొలకెత్తుతాయి.

ఈ విత్తనాల్లో టమాటా, పచ్చిమిర్చి, బెండ అలాగే పూల కు సంబంధించి బంతి పూలు, చామంతి పూలు, లిల్లీ పులా విత్తనాలను ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా వారి పెళ్ళికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను ఆహ్వానించారు.ఈ కార్డ్ యొక్క విశిష్టత తెలుసుకొని ఆయనను సజ్జనార్ అభినందనలతో ముంచెత్తారు.ఇందులో భాగంగానే తనకు చిన్నప్పటి నుంచి పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశం తోనే ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డు లను తయారు చేయించానని శశికాంత్ సమాధానమిచ్చారు.

#Civil Officer #Wedding Card #Sajjanar #Flowers Seeds #Trees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు