శుక్రవారం రోజు తెల్లటి పూలతో ఈ విధంగా పూజ చేస్తే లక్ష్మి కటాక్షం  

Flowers Offered To Hindu Gods And Goddesses In Pooja -

మనిషికి ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే దాక డబ్బులు అవసరం ఉంటుంది.డబ్బులు ఉండాలంటే లక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి.

ఆరోగ్యం, సౌభాగ్యం,పేరు ప్రతిష్టలు, ధైర్యం,ధాన్యం,విద్యా ఇలా ఏది కావాలన్నా డబ్బు ఉండాల్సిదే.అందువల్ల లక్ష్మి కటాక్షం ఉండాల్సిదే.

Flowers Offered To Hindu Gods And Goddesses In Pooja-Devotional-Telugu Tollywood Photo Image

ఆమె చల్లని చూపు మన మీద ఉంటేనే జీవితాన్ని సంతోషంగా గడపగలం.శుక్రవారం అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పూలు,నైవేద్యంలతో పూజ చేస్తే మంచిది.శుక్రవారం ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానము చేసి అమ్మవారికి ఇష్టమైన తెల్లని పూలతో పూజ చేయాలి.

అలాగే శుక్రవారం నాడు సాయంకాలం దీపాలు పెట్టేలోపు, ఇంటిని శుభ్రపరచుకుని… శుభ్రంగా ఆడవారు తయారు అయ్యి ఇంటి ముఖద్వారం గుమ్మాన్ని అలంకరించాలి.

గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి గుమ్మానికి రెండు వైపుల తెల్లని పూలను అలంకరించాలి.

అమ్మవారికి శుక్రవారం రోజున తెల్లని పూలతో పూజిస్తే చాలా ఇష్టం.శుక్రవారం నాడు గుమ్మానికి తెల్లని పూలు రెండు వైపులా పెట్టడం తో పాటు, అమ్మవారికి తెల్లని పూల దండ వేసి, తెల్లని పూలతో పూజిస్తే ఆమె చాలా సంతోషపడి…మన మీద ఆమె అనుగ్రహాన్ని చూపి జీవితంలో సుఖసంతోషాలను కలిగిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Flowers Offered To Hindu Gods And Goddesses In Pooja Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL