సామాన్యుడి ఖాతాలోకి వచ్చి పడ్డ 30 కోట్లు... బయటపడ్డ సంచలన నిజాలు

ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి.కొందరూ సైబర్ నేరగాళ్ళు సామాన్యులకి ఫోన్ చేసి లక్కీ లాటరీ అంటూ వారి డబ్బులు కాజేస్తూ ఉన్నారు.

 Flower Vendor Finds Zero Balance Account-TeluguStop.com

అయితే మరికొందరు సామాన్య ప్రజల జనధన్ ఖాతాలు ఉపయోగించుకొని వారికి తెలియకుండానే ఆ అకౌంట్స్ నుంచి లావాదేవీలు సాగిస్తూ ఆర్ధిక నేరాలు చేస్తున్నారు.అయితే చాలా మంది సామాన్యులు వారి ఖాతాలలో డబ్బులు దాచుకునే అంత ఆదాయం కూడా ఉండకపోవడంతో బ్యాంకు అకౌంట్స్ గురించి మరిచిపోతారు.

ఇలాంటి వాటిని ఆర్ధిక నేరగాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు.ఇదిలా తాజాగ కర్ణాటకలో రామనగర జిల్లా చెన్నపట్టణంలో రెహనా బానో, సయ్యద్ మల్లిక్ అనే దంపతులకి వింత అనుభవం ఎదురైంది.

2015లో రెహానా పేరిట ఆమె భర్త జనధన్ బ్యాంకు ఖాతాను ప్రారంభించారు.ఆ తరువాత ఆ ఖాతాని పెద్దగా ఉపయోగించింది లేదు.

అయితే గత ఏడాది డిసెంబరు మీ భార్య పొదుపు ఖాతాలో కోట్ల నగదు డిపాజిట్ అయ్యింది.బ్యాంకు ఖాతాను ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం చేయించుకోలేదు కాబట్టి వెంటనే మీరు ఆధార్ తో అనుసంధానం చేపించుకోండి” అని బ్యాంకు అధికారులు చెప్పడంతో అతను షాక్ అయ్యాడు.

బ్యాంకుకి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే అందులో అక్షరాల ముప్పై కోట్లు ఉన్నాయి.వాటిని చూసి షాక్ తిన్న అతను ఆశపడకుండా భయపడ్డాడు.

ఇదేదో పెద్ద క్రైమ్ తరహాలో ఉందని ఆదాయపు పన్ను అధికారులని ఆశ్రయించాడు.వారు విచారణ చేయగా డిసెంబరులో గుర్తుతెలియని వ్యక్తి రెహాన్కు ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో చీర కొన్నారు మీకు లాటరీ వచ్చింది.

మీ ఖాతా సంఖ్య చెబితే నగదు బదిలీ చేస్తాం అని చెప్పారు.దీనితో అది నిజమే అని నమ్మిన ఆమె వారికి ఖాతా సంఖ్య చెప్పింది.

అలా ఆమె ఖాతాలోకి తెలియకుండానే 30 కోట్లు వచ్చి పడ్డాయి.తరువాత ఆ ఖాతా నుంచి లావాదేవీలు కూడా జరిగాయి.

ఇక ఆ బ్యాంకు ఖాతాని ఫ్రీజ్ చేసిన అధికారులు ఈ భారీ స్కాం లో ఎవరి భాగస్వామ్యం ఉందనే విషయం తెలుసుకునే ప్రయత్నం మొదలెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube