ముఖం కాంతివంతంగా మారటానికి పువ్వులతో ఫెషియల్     2018-07-23   09:24:34  IST  Laxmi P

సాధారణంగా ఫెషియల్ చేయించుకుంటే చర్మం మృదువుగా మరియు రిలాక్స్ గా ఉంటుంది. ఫెషియల్ లో ముఖ కండరాలకు మసాజ్ చేయటం వలన మలినాలు తొలగిపోతాయి. అంతేకాక రక్త ప్రసరణ పెరిగి చర్మం మృదువుగా మారుతుంది. ఫెషియల్ చర్మాన్ని చైతన్యపరచి లోపల నుండి మృదుత్వాన్ని,ప్రకాశాన్ని కలిగిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు రాకుండా చేస్తాయి. ఫెషియల్ కి ఉపయోగించే ఉత్పత్తులు అన్ని చర్మ అన్ని పొరల్లోకి చొచ్చుకొని పోతాయి. దాంతో చర్మం తేమగా ఉంటుంది. ఫెషియల్స్ లో చాలా రకాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం పువ్వులతో ఫెషియల్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

రోజ్ ఫెషియల్

గులాబీలను అనేక సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. చర్మాన్ని మృదువుగా చేయటమే కాకుండా ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. చర్మ రంద్రాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అంతేకాక చర్మ బ్రేక్ అవుట్స్ ని కూడా సమర్ధవంతంగా తగ్గిస్తుంది. చర్మ రంద్రాలు ఎక్కువగా ఉన్నవారు ఈ రోజ్ ఫెషియల్ ని ఉపయోగించుకోవచ్చు.

Flower Face Packs For Glowing Skin-

Flower Face Packs For Glowing Skin

లావెండర్ ఫెషియల్

లావెండర్ క్రిమినాశక మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో అధికంగా ఉన్న నూనెను తగ్గిస్తుంది. మొటిమల సమస్యకు కారకాలను కూడా తరిమి కొడుతోంది. దాంతో మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. ఈ ఫెషియల్ ని రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే ముఖ ఛాయ కూడా మెరుగుపడుతుంది.

మ్యారీ గోల్డ్

పసుపు రంగులో ఉండే మ్యారీ గోల్డ్ పువ్వులను మన దేశంలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మంపై ఫ్రీ రాడికల్ నష్టంను తగ్గిస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన కాంతిని ఇస్తుంది.