ఫ్లోరిడా విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం: కాలి బూడిదైన 3,500 కార్లు

అమెరికాలోని నైరుతి ఫ్లోరిడాలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో వేలాది అద్దె కార్లు అగ్గికి ఆహుతయ్యాయి.

 Florida's Fort Myers Airport, 3,500 Rental Cars, Airport, Fire, America-TeluguStop.com

గత శుక్రవారం స్థానికంగా 20 ఎకరాల్లో ఉన్న గడ్డి మైదానాల్లో మంటల్లో చెలరేగి ఫోర్ట్ మైయర్ విమానాశ్రయాన్ని చుట్టుముట్టాయి.నెమ్మదిగా అక్కడ అద్దెకార్లు పార్కింగ్ చేసే ప్రాంతంపై అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వందలాది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.అనంతరం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణాన్ని పరిశీలించగా సుమారు 3,500 అద్దె కార్లు ఈ ప్రమాదంలో కాలి బూడిదైనట్లు లీ కౌంటీ పోర్ట్ అథారిటీ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

Telugu Cars, Airport, America, Floridasfort-

అగ్నికీలలు ఎగిసిపడుతున్న సమయంలో ఫోర్ట్ మైయర్స్‌ చుట్టూ కిలోమీటర్ల పరిధిలో పొగ దట్టంగా అలుముకుంది.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్స్‌తో పాటు సుమారు 80 ఎయిర్‌డ్రాప్‌లను రంగంలోకి దించినట్లు షార్లెట్‌ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఏవియేషన్ ‌యూనిట్ తెలిపింది.శుక్రవారం మంటలు ప్రారంభమైనప్పటి నుంచి 18 గంటల పాటు పార్కింగ్ ఏరియా, చుట్టుపక్కల ప్రాంతాలు మండుతూనే ఉన్నాయి.ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయంలోని నిర్మాణాలకు ఎటువంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణంపై ఎయిర్‌పోర్ట్ అధికారులు, ఫ్లోరిడా అటవీ శాఖ దర్యాప్తు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube