వైరల్ వీడియో: క్షణంలో సొర చేప నుంచి తప్పించుకున్న మహిళ!

నిజంగా ఈ వీడియో చూస్తే బెదిరిపోతారు.ఎప్పుడు సినిమాలలో చూడటమే కానీ ఇలాంటి రియల్ ఘటన చూసి ఉండరు.

 Florida Woman Escaped From Shark,florida Woman, Danger, Shark, Ocean, Viral Vide-TeluguStop.com

చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే మళ్లీ.అలా ఉంటుంది ఈ ఘటన.అసలు ఏమైందంటే? సాధారణంగా భారీ సైజు సొర చేపను చూస్తేనే భయం వేస్తుంది అలాంటిది ఓ మహిళ దానిని దగ్గరగా చూసింది… తెలివిగా ప్రవర్తించింది కాబట్టి ప్రాణాలు నిలిచాయి కానీ లేకుంటే తన ప్రాణం పోయేది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని ప్లోరిడాకు చెందిన ఓ మహిళ తన స్నేహితులతో కలిసి సముద్రంలోకి వెళ్ళింది.ఆ తర్వాత ఈత కొట్టాలని పడవలో నుంచి ఎంతో ఉత్సాహంగా సముద్రంలోకి దూకింది.

కానీ ఆమె సంతోషం ఎక్కువ కాలం మిగలలేదు.ఎందుకంటే ఆమె పడవ నుండి దూకిన తర్వాత కొద్దీ క్షణాలకే ఆమెకు పడవకు మధ్య ఓ సొర చేప వచ్చింది.

పడవ నుంచి అది చుసిన ఆమె కొడుకు అంథోని అరుస్తూ అక్కడ ఒక సొర చేప ఉందని చెప్పాడు.అది గమనించిన ఆమె మొదట బెదిరిపోయినప్పటికీ తెలివిగా అక్కడ నుండి బయటపడింది.

అది దగ్గరకు వచ్చినప్పుడు అరవకుండా నిశబ్దంగా ఉండడంతో ఆ సొర చేప మహిళకు వెళ్లినట వెళ్లి వెనక్కి వెళ్లిపోయింది.దీంతో ఆమె వెంటనే పడవ ఎక్కేసింది.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube