రోడ్డు పక్కన ఒక గుంట.. దాన్ని పూడ్చబోతుంటే పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే విషయం తెల్సింది, ఏంటో తెలుసా?

దొంగతనాలు తగ్గించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం, వాటిని ఛేదిస్తూ దొంగలు కొత్త పద్దతులు అన్వేశించడం చాలా కామన్‌ అయ్యింది.టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది దొంగలు కూడా అప్‌ డేట్‌ అవుతూ వస్తున్నారు.

 Florida Police Find Mystery Tunnel Leading To Chase Bank-TeluguStop.com

అన్ని దేశాల్లో కూడా దొంగలు చాలా అప్‌డేట్‌ అవుతూ కొత్త తరహాలో దొంగతనాలు చేస్తున్నారు.తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసిన ఈ విషయం పోలీసులే అవాక్కయ్యేలా చేసింది.

పోలీసుల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది.ఆ పని చేసింది ఎవరో కాని దండ వేసి దండం పెట్టాలన్నంతగా పోలీసులు భావించారట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఫ్లోరిడాలోని పెమ్‌ బ్రోక్‌ ఫైన్స్‌లోని ఛేజ్‌ బ్యాంకు సమీపంలో ఒక గుంట ఉంది.దాన్ని పూడ్చేందుకు పోలీసులు మరియు అధికారులు అక్కడకు చేరుకున్నారు.పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా ఆ గుంట కొద్ది లోతు లేదని తెలుసుకున్నారు.

మట్టి పోస్తూ ఉన్న కొద్ది లోనికి వెళ్తోంది.దాంతో అసలు లోపల ఏముందా అని అందులోకి వంగబడి చూడగా ఆ గుంట చాలా లోతుగా ఒక స్వరంగం మాదిరిగా కనిపించింది.

దాంతో వెంటనే ఆ గుంట ముఖ ద్వారా కాస్త పెద్దదిగా చేసి స్వరంగం గుండా లోనికి వెళ్లడం ప్రారంభించారు.ఆ స్వరంగం నేరుగా పక్కనే ఉన్న ఛేజ్‌ బ్యాంకు వద్దకు వెళ్లింది.

అదృష్టం కొద్ది ఈ స్వరంగంను కనిపెట్టారు.లేదంటే మరో రెండు మూడు రోజుల్లో స్వరంగం పూర్తి చేసి ఛేజ్‌ బ్యాంక్‌ను లూటీ చేసే వారు.ఈ విషయం తెలిసిన బ్యాంకు అధికారుల మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది.బయట నుండి వచ్చిన వారిని కనిపెట్టి అడ్డుకోవచ్చు.కాని ఇలా స్వరంగ మార్గం ద్వారా వచ్చే వారిని ఎలా అడ్డుకుంటాం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్వరంగం తోమిన వారి జాడ తెలుసుకునేందుకు ఎఫ్‌ బి ఐ రంగంలోకి దిగింది.

ఫోరిడా పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని ఎంక్వౌరీ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube