అమెరికాలో దొంగకే చుక్కలు చూపించిన బామ్మ...!!!

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ ఘటన తెలుసుకున్న ప్రజలు అమ్మో బామ్మ సూపర్ అంటూ చప్పట్లు కొడుతున్నారు.ఇంత ధైర్యం బామ్మకి ఎలా వచ్చింది, గ్రేట్ బామ్మ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 Florida Old Women Bites Theft-TeluguStop.com

పోలీసులు కూడా వెల్ డన్ అనేశారు.ఇంతకీ ఆ బామ్మా ఏమి చేసింది.

అంతగా ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి కారణం ఏమిటి అంటే.

అమెరికాలో దొంగకే చుక్కలు చూప

ఫ్లోరిడాలో 61 ఏళ్ళ అలైస్ కోల్‌మాన్ అనే ఓ బామ్మ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్క సారిగా తలుపు తట్టిన పెద్ద శబ్దం వచ్చింది.దాంతో ఉలిక్కిపడి లేచిన బామ్మ తడుముకోకుండా ఆలోచించకుండా తలుపు తీసేసింది.తలుపు తీసి తీయగానే దూసుకు వచ్చిన ఓ కుర్రాడు ఏమి ఆమెని బెదిరిస్తూ లోనికి వచ్చాడు.

పక్కకి తప్పుకో అంటూ బామ్మ ని దూషిస్తున్న సమయంలో

బామ్మ రివర్స్ అయ్యింది.నువ్వు ఎవడివి నా ఇంట్లోకి వచ్చి తప్పుకో అంటున్నావ్ అంటూ నువ్వు నా ఇంట్లో నుంచీ బయటకి వెళ్ళు అంటూ గట్టిగా అరించింది.

అక్కడితో ఆగకుండా అతడి చేయి పట్టుకుని గట్టిగా కరిచేసింది.వెంటనే బయటకి వచ్చేసింది.దాంతో అతడు ఆ కంగారులో ఏమి చేయాలో అర్థం కాక లోపల గడియ పెట్టుకుని ఉండిపోయాడు.బామ్మ తెలివిగా బయట గడియ పెట్టి పోలీసులకి సమాచారం అందించింది.

వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.బామ్మ ధైర్య సాహసాలకి మెచ్చుకున్నారు.

చుట్టుపక్కల వాళ్ళు సూపర్ బామ్మా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube