కమలా హారీస్ హత్యకు కుట్ర...53 వేల డాలర్లకు ఒప్పందం...

అమెరికా ఉపాధ్యక్షురాలిని హత్య చేయడానికి కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది.తాను చేసిన తప్పులు, కమలా హారిస్ ను చంపాలని అనుకున్న ప్లాన్ మొత్తం పూస గుచ్చినట్టుగా అధికారులకు చెప్పేసింది.

 Florida Nurse Arrested For Threatening To Kill Us Vice President Kamala Harris-TeluguStop.com

దాంతో ఫ్లోరిడా లోని జిల్లా కోర్టు ఆమెకు ఐదేళ్ళ పాటు జైలు శిక్ష విధించింది.ఇంతకీ అసలేం జరిగింది.


 Florida Nurse Arrested For Threatening To Kill Us Vice President Kamala Harris-కమలా హారీస్ హత్యకు కుట్ర…53 వేల డాలర్లకు ఒప్పందం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కమలా హారీస్ ను చంపేస్తానని ఫ్లోరిడా కు చెందిన ఓ నర్సు కొన్ని నెలల క్రితం బెదిరింపులకు దిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఆమె తీసుకున్న బెదిరింపుల సెల్ఫి వీడియో అందరికి షాక్ కు గురిచేసింది.

కమలా హారీస్ నీకు రోజులు దగ్గర పడ్డాయి లెక్క పెట్టుకో అంటూ బెదిరిస్తున్న ఓ వీడియో బయటకు రావడంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ వ్యూహాత్మకంగా ఆమెను అరెస్ట్ చేశారు.అప్పటి నుంచీ విచారణ చేపట్టగా తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు చెప్పింది.

నర్సుగా పనిచేస్తున్న 39 ఏళ్ళ నివియాన్ తాను ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ను చంపుతానని బెదిరింపులకు దిగినట్టుగా అంగీకరించింది.కమలా ను హత్య చేస్తానని ఆరు సార్లు బెదిరించానని కమలా నల్ల జాతీయురాలు కాకపోవడం వలనే ఆమెను చంపుతానని బెదిరించినట్టుగా నేరం ఒప్పుకుంది.అంతేకాదు ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ను చంపడానికి కొందరు వ్యక్తులతో కలిసి 53వేల డాలర్ల కు బేరం కుదుర్చుకున్నానని, కమలా హారీస్ పై బెదిరింపులకు పాల్పడ్డానని అంగీకరించింది.అయితే కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించడంతో ఆమెకు 5 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు.

#Kamala Harris #Kamala Harris #Florida Nurse #Secret #Florida

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు