ఆన్‌ లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ ను ఓపెన్‌ చేసి తిన్న డెలవరీ బాయ్‌.. అది మరవక ముందే మరో దారుణం

ప్రముఖ ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థ జొమాటో డెలవరీ బాయ్‌ కస్టమర్ల బాక్స్‌ ను ఓపెన్‌ చేసి తినడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే.కస్టమర్ల ఫుడ్‌ బాక్స్‌ జొమాటో డెలవరీ బాయ్‌ తీసి మరీ తినడంతో దేశ వ్యాప్తంగా కూడా ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 Florida Man Says He Received Dirty Underwear In Uber Eats Delivery-TeluguStop.com

ఈ సమయంలోనే జొమాటో నుండి సదరు డెలవరీ బాయ్‌ను తొలగించినట్లుగా సంస్థ ప్రకటించింది.భారీ స్థాయిలో డెలవరీ బాయ్‌పై చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇకపై డెలవరీకి వెళ్లే ఐటెంను మరింత భద్రతగా ప్యాక్‌ చేయిస్తామంటూ హామీ ఇచ్చిఇంది.ప్యాకెట్‌ను ఒకసారి ఓపెన్‌ చేస్తే మళ్లీ వేసే వీలు లేకుండా ప్యాక్‌ చేయిస్తామంటూ జొమాటో ప్రకటించింది.అయినా కూడా ఇప్పటికే జొమాటో పరువు గంగలో కలిసి పోయింది.జొమాటోకు ఆర్డర్లు భారీగా తగ్గాయి.ఇండియాలో జొమాటో ఏ స్థాయిలో ఫేమసో అమెరికాలో ఉబెర్‌ ఫుడ్స్‌ అంత ఫేమస్‌.అక్కడ కూడా కాస్త అటు ఇటుగా అలాంటి సంఘటనే జరగడంతో మరోసారి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థలపై తీవ్ర స్థాయిలో విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో లియో అనే వ్యక్తి ఒక హోటల్‌లో దిగాడు.అక్కడ నుండి ఉబెర్‌ ఫుడ్స్‌ ద్వారా తనకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకున్నాడు.ఆకలి మీదున్న ఆ వ్యక్తి ప్యాకెట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.ప్యాకెట్‌ రాగానే చేతులు క్లీన్‌ చేసుకుని, తినేందుకు సిద్దం అయ్యాడు.ప్యాకెట్‌ విప్పగానే షాక్‌ అయ్యాడు.ఆ ప్యాకెట్‌ లో యూజ్‌ చేసిన అండర్‌ వేర్స్‌ ఉన్నాయి.

షాక్‌ అయిన లియో వెంటనే పోలీసులకు మరియు ఉబెర్‌ సంస్థకు ఫిర్యాదు చేశాడు.వెంటనే స్పందించిన ఉబెర్‌ సంస్థ మరో ఫుడ్‌ ప్యాక్‌ను రిఫండ్‌ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పింది.కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.మరో వైపు ఉబెర్‌ ఫుడ్‌ వారు సదరు హోటల్‌తో ఒప్పందంను క్యాన్సిల్‌ చేసుకుంది.

ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయపడుతున్నారు.ఇంకా ముందు ముందు మరెన్ని ఇలాంటివి జరుగుతయో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube