ఫ్లోరిడా వాసి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు..చివరికి..!!!

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి తన భార్యని చంపేసి లబోదిబో అంటూ ఏడుపు మొదలు పెట్టాడు.అందరూ అతడిని చూసి తన భార్యపై ఎంత ప్రేమ ఉందొ అంటూ వారు కూడా దుఖంలో ఉండిపోయారు.

 Florida Man Filmed By Security Camera Killing Wife Sentenced-TeluguStop.com

అయితే ఆమె ఎలా చనిపోయింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా గుర్తొచ్చిన పిట్టకధలు అన్నీ వరుసగా చెప్పేశాడు.అప్పటికే అతడిపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

అప్పుడు తెలిసింది అసలు విషయం భర్తే హంతకుడు అని.అయితే ఎందుకు అతడు ఆమెని చంపాడు అనే వివరాలలోకి వెళ్తే.

ఫ్లోరిడా వాసి పోలీసులకి అడ్డ�

ఫ్లోరిడాకు చెందిన డ్వైట్ ల్యూటన్, ఆష్లే బాలిస్ ఇద్దరో భార్యా భర్తలు.ఈ దంపతులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో వారి మధ్య ఓ విషయం గురించి గొడవ జరిగింది.దాంతో తీవ్రంగా కోపానికి లోనయిన భర్త ఆమెపై తుపాకీ తో కాల్పులు జరిపాడు.అనంతరం తన భార్య తనని తాను కాల్చుకుని చనిపోయిందని నటించాడు.అయితే పోలీసులకి అతడు చెప్పేది అనుమానం రావడంతో.

ఈ ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించగా ల్యూటనే భార్యను కాల్చి చంపినట్టు తేలిపోయింది.

దాంతో మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.సాక్ష్యదారాలని పరిశీలించిన కోర్టు అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube