అమ్మతనంకే మచ్చ : అయిదుగురు పిల్లలను కారులో ఉంచి లాక్‌ చేసి ఆ పని కానిచ్చిన తల్లి

అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్న పిల్లలను చంపేయడం లేదంటే వారిని వదిలేయడం చేస్తున్న తల్లులను చాలా మందిని చూస్తున్నాం.జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూస్తాయి.

 Florida Drunk Mother Locks Her Childrens In The Car-TeluguStop.com

కాని కొంతరు తల్లిదండ్రులు మాత్రం వారి కన్న పిల్లలను అత్యంత దారుణంగా చిదిమేయడం మనం చూస్తూనే ఉన్నాం.ఇటీవలే అమెరికాలో ఒక మహిళ పోలీసు అధికారి ప్రియుడితో శృంగారంలో పాల్గొనేందుకు కారులో వెళ్లి, కారులో తన పాపాయిని ఉంచి లోనికి వెళ్లింది.

ప్రియుడితో శృంగారంలో మునిగి పోయిన ఆమె కారులో పాప ఉన్న విషయం మర్చి పోయింది.దాంతో ఊరిపి ఆడక ఆ పాప చనిపోయింది.

అదే సంఘటన తాజాగా మరోటి జరిగింది.అయితే ఈసారి కాస్త ముందుగానే తేరుకోవడంతో పిల్లలు బతికారు.

అమెరికా ఫ్లోరిడాలోని ఒక జంటకు అయిదుగురు పిల్లలు.ఒక చిన్న కంపెనీలో జాబ్‌ చేసే ఆ వ్యక్తి ఎప్పటిలాగే ఆఫీస్‌కు వెళ్లాడు.అయితే పిల్లలను తన తల్లి ఇంట్లో వదిలేసి వస్తాను అంటూ భర్తకు చెప్పి ఆమె కారులో బయలు జేరింది.ఆఫీస్‌ టైం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు భార్య కనిపించలేదు.

దాంతో ఆమె ఫోన్‌కు ఫోన్‌ చేశాడు.పిల్లలు ఎత్తి ఫోన్‌ అమ్మ లేదు అని చెప్పారు.

మీరు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించగా వారు ఏదో తెలిసిన అడ్రస్‌ను చెప్పారు.

వారు చెప్పిన వివరాలను బట్టి ఆ తండ్రి పరుగెత్తుకుంటూ వచ్చాడు.కొద్ది సమయం రోడ్ల మీద తిరిగిన తర్వాత అతడికి కారు కనిపించింది.అక్కడ ఆమె లేదు.

ఎదురుగా ఉన్న బార్‌లోకి వెళ్లాడు.అక్కడ ఆమె తాగి పడిపోయి ఉంది.

కారు డోరు లాక్‌ చేయడంతో ఆ పిల్లలను బయటకు తీసుకు వచ్చే పరిస్థితి లేదు.ఆమె జేబులో, పక్కన కారు కీ లేదు.

దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి కారు డోరును జాగ్రత్తగా తొలగించి పిల్లలను బయటకు తీసుకు వచ్చారు.కారులో అయిదుగురు పిల్లలు ఉన్నారు.

వారిలో మూడు నెలల కవల పిల్లలు ఇద్దరు ఉండటం విశేషం.

పిల్లలు అంతా కూడా అయిదు సంవత్సరాల లోపు వారే.అయినా కూడా తల్లి అలా వారిని కారులో వదిలేసి వెళ్లడం అమ్మతనంకే మచ్చ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఆమెపై కేసు నమోదు చేయకుండా మందలించి వదిలేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube