అమెరికాలో దారుణం..తన కొడుకు గే అనుకుని...చివరికి..

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది.పుట్టిన బిడ్డ ఎలా ఉన్నా సరే తల్లితండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.

 Florida Dad Son-TeluguStop.com

కానీ అమెరికాలో ఓ తండ్రి తన 11 ఏళ్ళ కొడుకుని ఏకంగా సుదూర ప్రాంతంలో వదిలి వచ్చేశాడు.దాంతో ఆ విషయం పోలీసులకి వరకూ వెల్లడంతో అరెస్ట్ అయ్యాడు.

ఇంతకీ ఆ తండ్రి ఎందుకు తనకోడుకుని వదిలి వెళ్ళాడు.ఇంతకీ ఆ కుర్రాడు చేసిన తప్పేంటంటే.

అమెరికాలోని ఫ్లోరిడాలో హెయిన్ సిటీలో ఈవ్నాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు.ఓ రోజు తన 10 ఏళ్ళ కొడుకు రూమ్ లోకి వెళ్లి చూడగా అతడు గే కి సంభందించిన నీలి చిత్రాలు చూస్తూ కనిపించాడు.

దాంతో తన కొడుకు గే అనుకుని అనుమానించిన అతడు వెంటనే తనకోడుకుని సూట్కేస్ లో బట్టలు సర్దేసి, కారులో ఎక్కించి హెయిన్స్ సిటీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కొట్టు దగ్గర వదిలి వెళ్ళిపోయాడు.

Telugu Son, Florida Dad, Telugu Nri Ups, Nri-

ఒక్క సారిగా జరిగిన ఈ పరిణామంతో కంగారుపడిన బాలుడు బిక్కు బిక్కు మంటూ ఉండగా ఈ విషయాని గమనించిన ప్రత్యక్ష సాక్ష్యులు జరిగిన విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి జరిగిన విషయం చెప్పి తండ్రిపై ఫిర్యాదు చేశారు.దాంతో పోలీసులు ఆ బాలుడి తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా తన మరో ఇద్దరు పిల్లలని భర్త వద్ద ఉంచి స్టేషన్ కి వెళ్ళింది.దాంతో ఆమె సమక్షంలోనే తండ్రిపై కేసు నమోది చేసి అరెస్ట్ చేయడానికి వెళ్ళగా అక్కడ కూడా ఇద్దరు పిల్లలని వదిలేసి అతడు పరారయ్యాడు.

దాంతో రెండు కేసులు అతడిపై పెట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube