ఫ్లోరిడా లో విచిత్రంగా పెళ్లి చేసుకున్న ప్రేమజంట

పెళ్ళిళ్ళు సర్గంలో జరుగుతాయని చాలా మంది అంటారు.ఆ మాటలో వాస్తవం ఎంత అనేది తెలియదు కాదు.

 Florida Couples Mud Park Wedding-TeluguStop.com

మనుషుల క్రియేటివిటీ, విచిత్రమైన ఆలోచనలతో పెళ్ళిళ్ళు, సముద్రంలో, ఆకాశంలో, అలాగే మంచు కొండల్లో కూడా జరుగుతున్నాయి.అలాగే కొన్ని పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం పెరిగిన తర్వాత ప్రపంచ ద్రుష్టిని ఆకర్షించేందుకు రకరకాలుగా క్రియేటివిటీ పెళ్ళిళ్ళు ప్రేమ జంటలు చేసుకుంటున్నాయి.ఇప్పుడు అలాంటి వింత వివాహం ఫ్లోరిడాలో జరిగింది.

ఇప్పుడు ఆ ప్రేమజంట వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదెలా అంటే.

ఫ్లోరిడాకు చెందిన ఓ జంట మినీ ఆటో వెనకవైపు చిన్న పందిరి వేసుకొని అక్కడే పెళ్లి చేసుకొంది.దానిలో పెద్దగా చెప్పుకోవడాని ఏమీ లేదు.కాని ఆ పెళ్లిలో పెళ్లి కూతురు బికినీ వేసుకుంది.పెళ్లికొడుక్కి చొక్కా వేసుకోలేదు.

బికినీలోని పెళ్లి కూతుర్ని పెళ్లిచేసుకొన్న తరువాత మినీ ఆటోలోంచి ఆమెను కిందకు దించి, అపురూపంగా ఎత్తుకొని ముద్దులు పెడుతూ తీసుకెళ్లి ఓ బురదగుంటలో పెళ్లి కొడుకు పడేశాడు.తను కూడా ఆమెతో పాటు బురదగుంటలో దూకి ఆమెను ముద్దులతో ముంచెత్తాడు.

ఈ వింత వివాహానికి హాజరైన వారి మిత్రులు వారి పెళ్లి వేడుకని కెమెరాల్లో బంధించారు.దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

ఇప్పటికే దాదాపు లక్షమంది దీన్ని షేర్ చేసి విపరీతంగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube