అమెరికాలో ఈ భార్యా భర్తలు ఎంతకు తెగించారంటే..  

Florida Couple Scam 82-year-old Veteran-drugs,florida,police,అమెరికా,ఫ్లోరిడా

అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఇద్దరు భార్యా భర్తలు, డ్రగ్స్ కి బానిసలుగా మారారు. డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారారంటే ఓ వృద్ధుడిని బెదిరించి మరీ ఆస్తిమోత్తం కాజేశారు. తమకి సాయం చేసిన వృద్ధుడి పైనే మోసానికి పాల్పడిన ఆ దంపతులు చివరికి జైల్లో చిప్ప కూడు తింటున్నారు..

అమెరికాలో ఈ భార్యా భర్తలు ఎంతకు తెగించారంటే..-Florida Couple Scam 82-year-old Veteran

ఫ్లోరిడాలో ఈ న్యూస్ ఇప్పుడు సంచలనం సృష్టించింది. అసలు ఆ దంపతులు ఇద్దరికీ తన దగ్గర ఉన్న డబ్బు ఎందుకు ఇచ్చాడు, వాళ్ళనే ఆయన ఎలా నమ్మాడు అనే వివరాలలోకి వెళ్తే.

సరిగ్గా మూడేళ్ళ క్రితం తన పిల్లలు తినడానికి కూడా మేము ఏమీ కొనలేని పరిస్థితిలో ఉన్నామని తిండి పెట్టలేక పోతున్నామని జెస్సికీ హెన్రీ(31) అనే యువతి వృద్దుడి సహాయం కోరడంతో జాలి చూపిన వృద్దుడు ఆర్ధిక సాయం చేశాడు. ఆరు నెలలు గడిచిన తరువాత తానూ ఓ కేసులో అరెస్ట్ అయ్యానని , ప్రొబేషన్‌లో భాగమైన యూరిన్ టెస్ట్‌లకు 350 డాలర్ల సహాయం చేయాలని మరోమారు కోరింది.

ఈ క్రమంలోనే సదరు యువతి భర్త అయిన దూషణ్ ప్రొబేషన్ ఆఫీసర్‌గా నాటకం ఆడుతూ వృద్ధుడి నుంచీ ప్రతీ రోజు 150 నుంచి 1000 డాలర్ల వరకు వసూలు చేస్తూ వచ్చాడు. కొన్ని రోజుల తరువాత డబ్బులు ఇవ్వనని వృద్దుడు నిరాకరించడంతో కారును స్వాధీనం చేసుకుంటానని, జైల్లో పెడుతానని బెదిరించాడు.

ఇలా అతడి నుంచీ దాదాపు 70 లక్షల రూపాయలు కాజేశారు ఇద్దరు భార్యా భర్తలు. డ్రగ్స్ కి బానిసైన వాళ్ళు వృద్దుడిని మోసం చేయడంతో అతడు పోలీసులకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఆత్మహత్యకి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని కాపాడి ఆ ఇద్దరు భార్యా భర్తల్ని జైలుకి పంపారు.