ఇద్దరి ప్రాణాలు కాపాడిన పెంపుడు పిల్లి.. అరిచి అరిచి దాని గొంతు పోయింది

ఇంట్లో కుక్కలు కాని, పిల్లులు కాని ఉంటే ఎంత మంచిదో అమెరికా ఫ్లోరిడాలో జరిగిన మరో సంఘటన నిరూపించింది.పెంపుడు జంతువులు యజమానుల ప్రాణాలు కాపాడాయి అంటూ చాలా సార్లు వార్తల్లో చూశాం.

 Florida Couple Close To Death Until Their Cat Rescued Them-TeluguStop.com

అదే విధంగా ఈసారి కూడా ఒక పెంపుడు పిల్లి తన యజమానుల ప్రాణాలు కాపాడింది.అందుకోసం చాలా కష్టపడింది.

తన గొంతు పోయేలా అరిచి అరిచి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది.పిల్లి వల్ల తమ ప్రాణాలు దక్కాయని, అయితే ఇప్పుడు ఆ పిల్లి అస్వస్థతతో ఉందని యజమానురాలు కన్నీరు పెట్టుకుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పిల్లి ఇష్యూ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్లోరిడాలోని డెల్టానా ఏరియాలో లీనా జోన్స్‌ మరియు ఆమె భర్త పాల్‌ ఉంటున్నారు.

తాజాగా ఒక రాత్రి వారు బాగా తాగి రాత్రి పొద్దు పోయిన తర్వాత ఇంటికి చేరుకున్నారు.రాత్రి సమయంలో ఇద్దరు తాగి ఘాడ నిద్రలో ఉండగా వారి పక్కన ఉండే ఒక కెమికల్‌ గోడంలో ఉండే కార్బన్‌ మోనాక్సైడ్‌ సిలిండర్‌ లీక్‌ అయ్యింది.

ఆ సిలిండర్‌ నుండి మెల్ల మెల్లగా కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు బయటకు వస్తుంది.ఆ వాయువు రాకను గమనించిన పిల్లి బాగా అరిచింది.పిల్లి అరుపుకు లీనా లేచింది.ఎప్పుడు లేనిది పిల్లి ఎందుకు ఇలా అరుస్తుందా అని లేచి చుట్టుపక్కల చూసింది.

అప్పుడే ఆమెకు కార్బన్‌ మోనాక్సైడ్‌ సిలిండర్‌ లీక్‌ అయిన విషయం గమనించింది.

పిల్లి అరిచి అరిచి దాన్ని గొంతు చిన్న బోయింది.పాల్‌ మాత్రం లేవక పోవడంతో వెంటనే లీనా పోలీసులకు, ఆంబులెన్స్‌, ఫైర్‌ వారికి ఫోన్‌ చేసింది.వెంటనే మూడు డిపార్ట్‌మెంట్స్‌ వారు వచ్చారు.

ఫైర్‌ వారు ఆ సిలిండర్‌ను క్లోజ్‌ చేయడంతో పాటు, అక్కడ నుండి వాయివు అంతా లాగేశారు.ఇక అంబులెన్స్‌లో పాల్‌ను హాస్పిటల్‌కు తరలించారు.

పాల్‌ కార్బన్‌ మోనాక్సైడ్‌ ఎక్కువగా పీల్చడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు.సమయానికి హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడంతో అతడి ప్రాణాలు దక్కాయి.

లీనా కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది.రెండు రోజులు ఇద్దరు హాస్పిట్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు.

వారి పరిస్థితి పూర్తిగా నయం అయ్యింది.కాని పిల్లి మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

తమ ప్రాణాలు కాపాడిన పిల్లి ఇప్పుడు అనారోగ్యంతో ఉండటంతో లీనా కన్నీరు పెట్టుకుంది.ఇద్దరి ప్రాణలు కాపాడిన ఆ పిల్లిని వావ్‌ గ్రేట్‌ అంటూ అంతా కూడా అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube