అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: 60 శాతం మందికిపైగా వ్యాక్సినేషన్.. అయినా ఫ్లోరిడాలో భారీగా కేసులు!

కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికాయే.వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

 Florida Coronavirus Cases Jump 50 Percent As Surge Continues-TeluguStop.com

ఆ తర్వాత ట్రంప్ మేల్కొన్నప్పటికీ అప్పటికే పరిస్ధితి విషమించింది.రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో అగ్రరాజ్యంలో మృత్యుదేవత కరాళ నృత్యం చేసింది.

అసలు అమెరికా ఇప్పట్లో కరోనా విపత్తు నుంచి బయటపడుతుందా అన్నంతగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.కానీ ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్.

 Florida Coronavirus Cases Jump 50 Percent As Surge Continues-అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: 60 శాతం మందికిపైగా వ్యాక్సినేషన్.. అయినా ఫ్లోరిడాలో భారీగా కేసులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన తొలి లక్ష్యంగా కోవిడ్ కట్టడిని ఎంచుకుని తీవ్రంగా కృషి చేశారు.వ్యాక్సినేషన్ ఒక్కటే వైరస్‌కు విరుగుడుగా భావించిన ఆయన టీకా యజ్ఞం చేశారు.

వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్‌ ఉద్ధృతి దాదాపుగా తగ్గుముఖం పట్టింది.ఇదే ఆనందంలో జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపడంతో పాటు అదే రోజున కరోనా విముక్తి దినోత్సం కూడా నిర్వహించారు.

కానీ ఆ సంతోషం అమెరికన్లకు ఎక్కువరోజులు లేదు.వైరస్ తగ్గినట్లే కన్పించినా.

గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది.

గురువారం అమెరికా వ్యాప్తంగా ఒక్కరోజులో 92 వేలకు పైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం 99 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి.

ఫిబ్రవరి రెండో వారం తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.అంతకుముందు రోజు 84 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు.

ఇలా గడిచిన మూడు నాలుగు రోజులుగా అమెరికాలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.

అటు ఫ్లోరిడా రాష్ట్రంలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 9,300 మంది కరోనాతో ఆస్పత్రిలో చేరినట్లు ప్రభుత్వం పేర్కొంది.గతేడాది జూలై 23న ఒకే రోజు రికార్డు స్థాయిలో 10,179 మంది ఆస్పత్రిలో చేరారు.

ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ సంఖ్యలో కరోనా రోగులు పెరుగుతున్నట్లు చెప్పింది.ఇప్పటివరకు ఫ్లోరిడాలో 60 శాతం మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డీసాంటీస్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

పాఠశాలల్లో కూడా పిల్లలకు మాస్కు తప్పనిసరిగా ధరింపజేయాలని కోరారు.అలాగే సామాజిక దూరం పాటించడం కూడా తస్పనిసరి అని పేర్కొన్నారు.

Telugu American Independence Day, Biden, Covid, Florida Coronavirus Cases Jump 50 Percent As Surge Continues, State Governor Ron Desantis, State Of Florida, Trump, Vaccine-Telugu NRI

మరోవైపు వ్యాక్సినేషన్ రేటును పెంచడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాష్ట్రాలకు కీలక సూచన చేశారు.టీకా తీసుకునే వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలని దిశానిర్దేశం చేశారు.వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చిన వారికి సుమారు 100 డాలర్ల వరకు (భారత కరెన్సీలో దాదాపు రూ.7400) నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.నగదు అందించడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు.

#GovernorRon #Florida #Vaccine #Biden #Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు