నితిన్ ఫ్లాప్ సెంటిమెంట్ కు ఆ మూవీ బ్రేక్ వేస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 19 సంవత్సరాల క్రితం హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు నితిన్.మిగతా హీరోలకు భిన్నంగా నితిన్ కెరీర్ లో వరుస ఫ్లాపుల వచ్చిన ప్రతిసారి ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ నితిన్ కెరీర్ కు ప్లస్ అవుతోంది.

 Flop Sentiment For Nithin Rang De Movie-TeluguStop.com

సై సినిమా తరువాత సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న నితిన్ ఇష్క్ సినిమాలో సక్సెస్ బాట పట్టారు.ఆ సినిమా తరువాత విడుదలైన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా కూడా హిట్ అయింది.

గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తరువాత నితిన్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కాగా అ ఆ సినిమా నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.అయితే ఆ సినిమా తరువాత నితిన్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

 Flop Sentiment For Nithin Rang De Movie-నితిన్ ఫ్లాప్ సెంటిమెంట్ కు ఆ మూవీ బ్రేక్ వేస్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతేడాది భీష్మ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నితిన్ కు ఈ ఏడాది విడుదలైన చెక్ సినిమా రిజల్ట్ అవాక్కయ్యేలా చేసింది.చెక్ సినిమాతో నితిన్ కెరీర్ లో మరో ఫ్లాప్ సినిమా వచ్చి చేరింది.

Telugu Chek, Flop Sentiment, Nithin, Rang De Movie, Venky Atluri-Movie

అయితే చెక్ సినిమా ఫ్లాప్ అయినా రంగ్ దే సినిమాతో సక్సెస్ సాధిస్తానని నితిన్ భావిస్తున్నారు.నితిన్ ఫ్లాపులకు రంగ్ దే బ్రేక్ వేస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ నెల 26వ తేదీన రంగ్ దే సినిమా విడుదల కానుంది.నితిన్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.నితిన్ కీర్తి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన రంగ్ దే సినిమా పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా వెంకీ అట్లూరి ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

#Nithin #Venky Atluri #Flop Sentiment #Chek #Rang De Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు