ఎడారి దేశంలో వరద బీభత్సం.. వీడియో వైరల్!

ఇటీవల వర్షాలు భారీగా పడుతున్నాయి.భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.

 Floods In Desert Country Video Goes Viral, Cyclone Shaheen, Oman, Desert Country-TeluguStop.com

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసాయి.దీని వల్ల కొన్ని లోటత్తు ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చాయి.

దీంతో ప్రజలు ఈ వర్షాలు, వరదల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే ఇలాంటి వరదలు మన దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో ఒక ప్రాంతంలో మనం చూస్తూనే ఉంటాం.

తరచు ఎక్కడో ఒక చోట వర్షాలు పడి వరదలు వస్తూనే ఉంటాయి.కానీ ఎడారి ప్రాంతంలో వరదలు వచ్చినట్టు ఎప్పుడైనా విన్నారా.అయితే ఇది మీ కోసమే.తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియో ప్రకారం ఎడారి దేశమైన ఒమన్ లో వరదలు వచ్చాయని దీని సారాంశం.ఎడారి అనగానే ఎప్పుడు ఎండ, ఇసుక మినహా మనకు పెద్దగా ఏమి గుర్తుకు రాదు.

కానీ ఇక్కడ మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఎడారి ప్రాంతంలో వర్షం కురవడమే పెద్ద విశేషం.అలాంటిది వరదలు వస్తున్నాయంటే జనాలు నమ్మలేక పోతున్నారు.గత కొద్దీ గంటలుగా ఒమన్ దేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.దీని వల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.రోడ్ల మీద నడుముల లోతులో నీళ్లు చేరడంతో వాహన దారులు కూడా అవస్థలు పడుతున్నారు.

అక్కడ అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాన్ వల్ల ఒమన్ దేశంలో భారీ వర్షపాతం నమోదయ్యింది.తుఫాన్ తీరం దాటే సమయంలో మరింత వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఒమన్ రాజధాని అయినా మస్కట్ లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు బయటకు రావాలంటేనే బయపడి పోతున్నారు.ప్రెసెంట్ ఈ వరదలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube