చీరలో పల్టీలు కొట్టింది.. నెట్టింట వీడియో వైరలయ్యింది!

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు పాశ్చాత్య దేశ అలవాట్లకు బానిస అయిపోయి హిందూ సాంప్రదాయాలను మర్చిపోతున్నారు.ఈమధ్యకాలంలో ఎక్కువ మంది అమ్మాయిలు పాశ్చాత్య దుస్తులను ధరించడం మనం చూస్తూనే ఉన్నాం.

 Gymnast ,flipped In Saree Went Viral On Internet, Girls Wearing Western Clothes,-TeluguStop.com

హిందూ సాంప్రదాయం ప్రకారం పద్ధతిగా చీర కట్టుకొని అమ్మాయిలు కనుమరుగైపోయారు అని చెప్పవచ్చు.ఏదో చిన్న చిన్న ఫంక్షన్లకు మినహా చీర కట్టడం మానేశారు.

ఎప్పుడో ఒక సారి చీర కట్టుకొని కొన్ని పనులు చేయాలంటే ఎంతో కష్టంగా భావిస్తున్నారు.కాని కొంతమంది మహిళలు మాత్రం చీరలో ఎంతో సునాయాసంగా వారిలో దాగి వున్న ప్రతిభను కనబరుస్తున్నారు.

సాధారణంగా క్రీడలలో పాల్గొనేవారు ప్రత్యేకమైన దుస్తులను ధరించి పాల్గొంటారు.ఆ విధంగా క్రీడకు సంబంధించిన దుస్తులు ధరించడం వల్ల క్రీడలలో పాల్గొనటానికి ఎంతో అనువుగా ఉంటుంది.కానీ చీర కట్టుకొని క్రీడలలో రాణించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.ఈ విధంగా చీర కట్టి క్రీడలలో పాల్గొనాలి అంటే వారికి ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి అని చెప్పవచ్చు.కానీ ప్రస్తుత కాలంలో మహిళా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎన్నోసార్లు మహిళలు రుజువు చేశారు.తాజాగా ఈ యువతి చేసిన వీడియోని చూస్తే మనకు అర్థమవుతుంది.

ఒక యువతి చీరకట్టుకొని ఎంతో చాకచక్యంగా పల్టీలు కొడుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది.

చీర కట్టుకొని ఆ యువతి ఎంతో నేర్పుగా, ఒడుపుగా తనకున్న ప్రతిభను ప్రదర్శించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.ఆ యువతి చీరలో పల్టీలు కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది.ఆ యువతి చీరలో ఎంతో చాకచక్యంగా చేసిన వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది తన ప్రతిభ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube