దీపావళికి ఫ్లిప్ కార్ట్ మరో సేల్ ప్రారంభం!

Flipkart Big Diwali Sale, Flipart, Diwali Sale, Diwali Offers, Flipkart Launches Festival Offers, E Commerce, Festival Offers

పండగ సీజన్లను పురస్కరించుకుని చిన్న షాపుల నుంచి పెద్ద మాల్స్ వరకు భారీ డిస్కౌంట్ లను, ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటుంది.అయితే కరోనా నేపథ్యంలో లో షాపింగ్ మాల్స్ కన్నా, ఈ కామర్స్ ద్వారా కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ఇంటి నుంచి షాపింగ్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

 Flipkart Big Diwali Sale, Flipart, Diwali Sale, Diwali Offers, Flipkart Launches-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ సంస్థలన్నీ కూడా ప్రత్యేకమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
దసరా పండుగను పురస్కరించుకొని ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో సేల్స్ ను నిర్వహించిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు తాజాగా మరో సెల్ కు సిద్ధమైంది.

దీపావళి పండుగను పురస్కరించుకొని“బిగ్ దివాలి సేల్” పేరిట సేల్స్ ప్రారంభించింది.అయితే ఈ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ సెల్ నడుస్తుందని ఈ సంస్థ పేర్కొంది.

ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కు ఈ సేల్ లో ముందుగా పాల్గొనే అవకాశం వారికి కల్పించింది.

మొత్తం ఏడు రోజుల పాటు నడిచే ఈ సెల్ లో భాగంగా ప్రముఖ యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు కలిగిన వినియోగదారులకు 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

అంతేకాకుండా ఇతర బ్యాంకు కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ఈ సేల్ కల్పించింది.బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగానే బిగ్ దివాలి సేల్ లో కూడా మొబైల్స్ పై ప్రత్యేక డిస్కౌంట్లను కల్పించింది.

సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 41, గెలాక్సీ ఎస్ 20 +, గెలాక్సీ ఏ50 ఎస్ తో పాటు ఎం 2, ఎం 2 ప్రో,ఒప్పో రెనో 2ఎఫ్‌, ఏ52, ఎఫ్‌15, రియల్‌మీ నార్జో 20 సిరీస్‌ మొదలైన ఫోన్లపై బిగ్ దివాలి సెల్ లో ప్రత్యేక డిస్కౌంట్లను కస్టమర్లకు కల్పించనుంది.

అంతే కాకుండా కేవలం ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్ ను ఈ బిగ్ దివాలి సేల్ కస్టమర్లకు అందించనుంది.

కేవలం ఫోన్లపై మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు అయినా లాప్టాప్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, మైక్రోఓవెన్ లో మొదలైన వాటిపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్లను ఈ సేల్స్ ద్వారా అందించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube