విమానాలు వివిధ కారణాలతో ఒక్కోసారి ఆగిపోతాయి.ఆ సమయంలో ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.
అయితే ఎందుకు విమానం ఆగిపోయిందే దానికి సరైన కారణం ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీలుండదు.ఒక్కోసారి విమానాశ్రయాలు( Airports ) ఉన్న నగరాలలో వాతావరణ పరిస్థితులు బాగోవు.
అలాంటి సందర్భంలో ప్లేన్‌లను టేకాఫ్ చేయడం కంటే ప్రయాణం రద్దు చేయడం మంచిది.అయితే ఓ విచిత్ర కారణం వల్ల విమానం ఆగిపోయింది.
“టేకాఫ్ చేయడానికి చాలా బరువుగా” ఉన్నందున విమాన ప్రయాణాన్ని పైలట్లు ఆపేశారు.సాధారణంగా విమానం ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడికి లగేజీ బరువుపై పరిమితి ఉంటుంది.
దానిని అనుసరించే ప్రయాణికులు తమ వెంట లగేజీ తీసుకెళ్తుంటారు.అయితే ఈ బరువు కారణంగా విమానం ఆగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
ఈ వింత ఘటన యూకేలోని ఈజీ జెట్ ఎయిర్ లైన్ కంపెనీ( EasyJet airline company, UK ) విమానంలో చోటు చేసుకుంది.ఆ ఈజీ జెట్ విమానం ఈ నెల 5న స్పెయిన్‌లోని లాంజరోట్( Lanzarote in Spain ) నుండి లివర్‌పూల్‌కు వెళ్లాల్సి ఉంది.బుధవారం రాత్రి 9.45 గంటలకు బయలుదేరే ముందు అధిక బరువు మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది.
విమానంలో పైలట్లు చెబుతున్న ప్రకటనను ఓ ప్రయాణికుడు రికార్డు చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు.అందులో ‘విమానం టేకాఫ్ చేయడానికి వీలుపడదు.ప్రస్తుతం ఉన్న లాంజరోట్ విమానాశ్రయం రన్ వే చాలా చిన్నది.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు.
భారీగా గాలులు వీస్తున్నాయి.ఈ సమయంలో అధిక బరువుతో విమానాన్ని టేకాఫ్ చేయడానికి వీలు పడదు.
అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ మార్గం ఉంది.విమానాన్ని తేలిక చేయడం.
లేదా ఈ రాత్రి లివర్ పూల్ వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని స్వచ్ఛందంగా వాయిదా వేసుకోవడం.దీనికి అంగీకరిస్తే ఒక్కో ప్రయాణికుడికి 500ల యూరోలు అందిస్తాం.’ అని పైలట్ ప్రకటించాడు.
ఆ తర్వాత 19 ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగిపోయారు.తర్వాత ఫ్లైట్ రాత్రి 11.24కి బయలుదేరింది.షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటల ఆలస్యంగా అది టేకాఫ్ అయింది.గురువారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత లివర్ పూల్ లోని జాన్ లెన్నాన్ విమానాశ్రయానికి చేరుకుంది.
అయితే ఈ చర్యను ఆ ఎయిర్ లైన్ సంస్థ సమర్ధించుకుంది.వాతావరణ సమస్యలు ఉన్నాయని, అధిక గాలులు వీస్తున్న సమయంలో విమానం టేకాఫ్ చేసి ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొంది.