అలా ఎలా : ఆ విమానం 32 సంవత్సరాల పాటు టైమ్ ట్రావెల్ చేసిందట...కానీ

ప్రస్తుత కాలంలో కొన్ని సంఘటనలను వింటే ఆశ్చర్యంతో పాటు ఒళ్ళు గగుర్పాటుకి కూడా గురవుతుంది.తాజాగా 32 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినటువంటి విమానం ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా చాలా సురక్షితంగా లాండింగ్ కాగా,  కానీ ఆ విమానంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరూ అప్పటికే మరణించినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Flight Missing, Germany, Brazil, Death And Missing Mystery-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం….

వివరాల్లోకి వెళితే  1954 వ సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన టువంటి ఓ విమానం కొంతమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకుగాను బయలుదేరింది.

కానీ ఏమైందో ఏమో గాని దాదాపుగా 32 సంవత్సరాల తర్వాత బ్రెజిల్ దేశంలోని  ఓ ప్రాంతంలో అనుకోకుండా ల్యాండింగ్ అయింది.అయితే ఈ ల్యాండింగ్ సమయంలో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

కానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మరియు పైలెట్ అందరూ చనిపోయి చాలా కాలం అయినట్లు వైద్య నిపుణులు గుర్తించారు.దీంతో ప్రయాణికులతో బయలుదేరినటువంటి విమానం కనిపించకుండా పోయి 32 సంవత్సరాల కాలం తర్వాత ల్యాండ్ అవ్వడం, అది కూడా ఎటువంటి పైలెట్ సహాయం లేకుండా ప్రమాదం జరగకుండా ల్యాండింగ్ అవ్వడం,  వంటి అంశాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

కాగా ఈ  సంఘటన జరిగి ఇప్పటికే దాదాపుగా 22 సంవత్సరాలు కావస్తున్నపటికీ ఈ విమానం గురించి వివరాలను మాత్రం ప్రభుత్వ అధికారులు వెల్లడించడం లేదు.అంతేగాక మరికొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం విమానం కనబడకుండా పోయిన  సమయంలో టైం ట్రావెల్ చేసి ఉంటుందని అందువల్లనే విమానంలోని వారు అన్నపానీయాలు లేక మృతి చెంది ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో మరికొంతమంది నెటిజన్లు మాత్రం నిజ జీవితంలో నిజంగానే టైం ట్రావెల్ చేసే ఆస్కారం ఉంటుందా అంటూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.కానీ ఇప్పటి వరకు ఈ టైం ట్రావెల్ ప్రశ్నలకు సరైన జవాబులు దొరకడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube