తొలి మహిళా ఫైట్ లెఫ్టినెంట్ ఖాతాలో మరో అరుదైన ఘనత

ఫైట్ ఫైటర్ విమానాలని నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు.దానికి ఎంతో నైపుణ్యంతో పాటు ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధమైపోవాలి.

 Flight Lieutenant Mohana Singh Became The First Woman Fighter Pilot-TeluguStop.com

ఒక వేళ యుద్ద సమయాలో, రెండు దేశాల మధ్య పోరులో ముందుగా ఫైట్ ఫైటర్ విమానాలే శత్రువులతో తలపడుతూ ఉంటాయి.ఆ మధ్య పాకిస్తాన్ తో తలెత్తిన యుద్ధ వాతావరణంలో ఫైటర్ ఫ్లైట్ ని నడిపిన అభినందన్ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేసి, అనుకోకుండా ప్రమాదంలో ఆ దేశానికి యుద్ధ ఖైదిగా దొరికిపోయాడు.

అయితే ప్రస్తుతం ఎలాంటి యుద్ధం జరగలేదు కాబట్టి పాకిస్తాన్ అతనిని ఇండియాకి అప్పగించింది.అయితే యుద్ధ సమయాలలో మాత్రం ఇలా దొరికిన వారిని చిత్ర హింసలకి గురి చేసి చంపేస్తూ ఉంట్నారు.

ఇలాంటి అనుభవాలు ఫైట్ ఫైటర్స్ కి ఎక్కువగా ఉంటాయి.

ఇదిలా ఉంటే ఇండియన్ మొదటి మహిళ ఫైట్ ఫైటర్ రికార్డ్ సృష్టించిన మోహనా సింగ్ మరో అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది.

అత్యాధునిక హాక్‌ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.బెంగాల్‌లోని కలైకుండా వాయుసేన కేంద్రంలో మోహనా సింగ్‌ శిక్షణను పూర్తిచేసుకున్నట్లు రక్షణశాఖ తెలిపింది.

శిక్షణలో రాకెట్ల ప్రయోగం, బాంబులు జారవిడవడం, లక్ష్యాలను గురిచూసి కాల్చడం వంటి ప్రక్రియల్ని పూర్తిచేశారు.ఆమెకు 500 గంటలకుపైగా ఫ్లయింగ్‌ అనుభవం ఉండగా, ఇందులో 380 గంటలు హాక్‌ ఎంకే–132 జెట్‌ను నడిపారు.

ఇప్పుడు తన ధైర్య సాహసాలతో మోహనా సింగ్ దేశ వ్యాప్తంగా ఓ సంచలనంగా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube