ఆమె మతిమరుపుతో ఫ్లైట్‌ యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది... ఆమె ఏం మర్చిపోయిందో తెలుసా?  

Flight Forced To Turn Back After Mother Forgets Baby At Jeddah Airport-flight Forced To Turn Back,jeddah Airport,mother Forgot Her Child

  • ప్రయాణ సమయంలో కొందరు ఏదో ఒకటి మర్చి పోతూ ఉంటారు. ఇంటి వద్ద ఒకటికి పది సార్లు ఆలోచించినా కూడా ఏదో ఒక వస్తువు మర్చి పోయామని రైల్వే స్టేషన్‌ లేదా ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లిన తర్వాత అయ్యో అనుకుంటూ ఉంటారు. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అయితే చిన్న చిన్న వస్తువులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద వస్తువులను కూడా కొన్ని సార్లు మర్చి పోతూ ఉంటారు. అయితే అదంతా ఇంటి వద్ద విషయం. ఒకసారి ఎయిర్‌ పోర్ట్‌కు లేదా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నామంటే అన్ని వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఎన్ని బ్యాగులు మనం తీసుకు వచ్చాం, అన్ని ఉన్నాయా లేదా అనే విషయాన్ని పదే పదే చూసూకుంటూ ఉంటాం. అయితే ఒక మహిళ మాత్రం తనకు సంబంధించినవి అన్ని తీసుకుని ప్లైట్‌ ఎక్కింది. అయితే తన బిడ్డను మర్చి పోవడం చర్చనీయాంశం అయ్యింది.

  • సౌదీ అరేబియాలోని అబ్దులజీబ్‌ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌ వెళ్లేందుకు ఎస్వీ838 విమానం సిద్దం అయ్యింది. విమానంలో అంతా కూడా ఎక్కేశారు. విమానం టేకాఫ్‌కు సిద్దం అయ్యిందని పైలెట్‌ ప్రకటించాడు. ఎయిర్‌ హోస్టస్‌ కూడా అందరిని సీటు బెల్టు పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. విమానం గాల్లోకి ఎగిరింది. గాల్లోకి ఎగిరిన కొన్ని నిమిషాలకే ఒక మహిళ తన బిడ్డను ఎయిర్‌ పోర్ట్‌ లో మర్చి పోయాను, దయచేసి సాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. అప్పుడు విమాన సిబ్బందికి ఏం చేయాలో పాలు పోలేదు.

  • Flight Forced To Turn Back After Mother Forgets Baby At Jeddah Airport-Flight Jeddah Airport Forgot Her Child

    Flight Forced To Turn Back After Mother Forgets Baby At Jeddah Airport

  • వెంటనే పైలెట్‌ అబ్దులజీబ్‌ విమానాశ్రయ అధికారులతో చర్చించడం జరిగింది. విమానం యూ టర్న్‌ తీసుకుని మళ్లీ ల్యాండింగ్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ నుండి అనుమతి లభించింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ నియంత్రణతో టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం మళ్లీ ల్యాండింగ్‌ అయ్యింది. ల్యాండ్‌ అయిన వెంటనే ఆ బిడ్డను విమానాశ్రయ సిబ్బంది విమానం వద్దకు తీసుకు వెళ్లారు. దాంతో మళ్లీ కొద్ది నిమిషాలకే విమానం మళ్లీ టేకాఫ్‌ అయ్యింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా సదరు విమానం కోలాలంపూర్‌ చేరుకుంది. ఆ బిడ్డను మర్చిపోయినందుకు కొందరు ప్రయాణికులు ఆమెను మందలించగా, మరికొందరు మాత్రం పాపం అంటూ ఆమెపై జాలి చూపించారట. మొత్తానికి కథ ప్రశాంతంగా సుఖాంతం అయ్యింది.