ఫ్లైట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌.. టేకాఫ్ చేయ‌న‌న్న పైలెట్.. కార‌ణం తెలిస్తే షాక్‌

చాలామంది డ్యూటీల విష‌యంలో చాలా చాలా ర‌కాలుగా ఉంటారు.కొన్ని స‌ర్వీసుల రంగాల్లో ప‌నిచేసే వారు మాత్రం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

 Flight Emergency Landing Pilot Who Took Off Shock If The Cause Is Known , Flight, Viral News-TeluguStop.com

అంతేగానీ నా డ్యూటీ టైమ్ అయిపోయింది నేను చేయ‌ను అంటే మాత్రం కుద‌రదు.ఎందుకంటే వారి సేవ‌లు అత్యంత అవ‌స‌రం.

ఇక విమ‌నాం న‌డిపే పైల‌ట్ కూడా క‌చ్చితంగా డ్యూటీ టైమ్‌కు వెళ్లిపోతానంటే కుద‌ర‌దు.క‌చ్చితంగా డ్యూటీ టైమింగ్  కాకుండా కొన్ని అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎక్కువ స‌మ‌యం కూడా ప‌నిచేయాల్సి ఉంటుంది.

 Flight Emergency Landing Pilot Who Took Off Shock If The Cause Is Known , Flight, Viral News-ఫ్లైట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌.. టేకాఫ్ చేయ‌న‌న్న పైలెట్.. కార‌ణం తెలిస్తే షాక్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ప‌ని చేయ‌కుండా మొండికేస్తే మాత్రం చివ‌ర‌కు ప్ర‌యాణికుల ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దు.అయితే ఇప్పుడు కూడా ఓ ఫైలెట్ ఇలాగే చేసి చివ‌ర‌కు ప్ర‌యాణికులతో చివాట్లు పెట్టించుకున్నాడు.

ప్ర‌యాణం మ‌ధ్య‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసిన అత‌ను.ఆ త‌ర్వాత మాత్రం టేకాఫ్ చేయ‌లేదు.

పాకిస్తాన్ కు చెందిన పైలెట్ ఆదివారం విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఫ్లైట్‌ను న‌డుపుతుండ‌గా.ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.

వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు బాగో లేవ‌ని ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్నిసౌదీలో ల్యాండింగ్ చేశాడు.

అయితే ఆ త‌ర్వాత మాత్రం త‌న డ్యూటీ టైమింగ్ అయిపోయింద‌ని, తాను టేకాఫ్ చేయ‌లేనంటూ చెప్పాడు.

అంతే ప్ర‌యాణికులు మొత్తం అత‌ని మీద సీరియ‌స్ అయ్యారు.చివ‌ర‌కు పై అధికారులు రంగంలోకి దిగి అత‌నికి క్లాస్ పీకారు.

ఇక ప్రయాణికులను ద‌గ్గ‌ర‌లోని హోటల్‌లోనే బస చేయించారు.ఇక పైలెట్ ను విశ్రాంతి తీసుకుని త‌ర్వాత డ్యూటీ ఎక్క‌డ‌మ‌ని చెప్పారు.

ఈ విష‌యాన్ని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అధికారికంగా వెల్ల‌డించారు.ఎవ‌రు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించాడు.

అయితే ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.దీని మీద అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube