బిల్డింగ్ మీద కూలిన ఫ్లైట్‌.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం..

ఈ మ‌ధ్య విమానాలు అనుకోకుండా కుప్ప‌కూలిపోతున్నాయి.దీంతో వంద‌లాదిమంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి.

 Flight Crashes On Building Eight Killed In Italy Milan City, Flight Crashes, Vir-TeluguStop.com

ఇక తాజాగా మ‌రో విమానం కుప్ప‌కూలింది.గాల్లోకి ఎగిరిన కొద్ది సేప‌టికే కింద కూలిపోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం చోటుచేసుకుంది.

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న ఇట‌లీలోని మిలాన్ సిటీలో చోటుచేసుకుంది.కాగా ఈ ప్ర‌మాదంలో ఎనిమింది మంది మ‌ర‌ణించారు.

అయితే ఆ ఫ్లైట్ కూలిన బిల్డింగులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణాపాయం పెద్ద ఎత్తున జ‌ర‌గ‌లేదు.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇట‌లీ ఆఫీస‌ర్లు తెలిపారు.

కాగా విమానంలో ఉన్న వ్య‌క్తులే చ‌నిపోయార‌ని, మిగ‌తా మ‌ర‌ణాలు ఏమీ సంభ‌వించ‌లేదంటూ వివ‌రించారు అధికారులు.అయితే ఈ ఫ్లైట్ మిలాన్ న‌గ‌రంలోని లినేట్ ఎయిర్ పోర్టు నుంచి స‌ర్డినియా వెళ్లేందుకు బ‌య‌టు దేరగా మార్గ మ‌ధ్య‌మంలో గాల్లోకి లేచిన కొద్ది సేప‌టికే ఇలా జ‌రిగింది.

అయితే దీనికి బిలియ‌నీర్ డాన్ పెట్రెస్కూ పైలెట్‌గా ఉండ‌గా ఆయ‌న కుటుంబ‌మే ఇందులో ఉంది.ఆయ‌న స‌తీమ‌ణి, కొడుకు, ఇంకో ఐదుగురు ముఖ్య‌మైన వారు ఇందులో ఉన్నార‌ని చెబుతున్నారు.

వారంతా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ నిమిత్తం వెళ్తుండ‌గా ఇలా జ‌రిగింద‌ని అధికారులు ధృవీక‌రించారు.

Telugu Clash, Crashes, Italy, Linet Airport, Milan-Latest News - Telugu

అయితే ఫ్లైట్ గాల్లో ఉన్న‌ప్పుడే సింగిల్ ఇంజిన్ పీసీ-12 కి అనుకోకుండా మంట‌లు చెలరేగి ఫ్లైట్ ఇంజిన్‌లోకి వ్యాపించాయ‌ని, అందుకే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుపుతున్నారు.ఇక ఈ ఫ్లైట్ ఎవ‌రూ లేని బిల్డింగ్‌లోకి దూసుకురావ‌డంతో అందులో ఉన్న ఎనిమిది మంచి చ‌నిపోయార‌ని, కానీ ఇంకెవ‌రూ చ‌నిపోలేదంటూ చెబుతున్నారు ఇట‌లీ ఆఫీస‌ర్లు ఇందులో అంటే చ‌నిపోయిన వారిలో ముగ్గురు రొమేనియన్లతో పాటుగా ఇద్దరు ఫ్రెంచ్ వ్య‌క్తులు, అలాగే ఇటాలీ, కెనడాకు చెందిన ఇద్ద‌రు ఉన్నారంటూ ఆఫీస‌ర్లు పూర్తి వివ‌రాల‌పై బులిటెన్ విడుద‌ల చేశారు.ఈ ఘ‌ట‌న‌పై ఇట‌లీ ప్ర‌భుత్వం విచారం వ్య‌క్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube