అమెరికా లో తప్పిన పెను విమాన ప్రమాదం

అగ్రరాజ్యం అమెరికా లో పెను ప్రమాదం తప్పింది.క్యూబా నుంచి అమెరికా వస్తున్నా బోయింగ్ 737 విమానం రన్ వే నుంచి నదిలో పడిపోయింది.

 Flight Crashes In Florida River-TeluguStop.com

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు.అదృష్ట వశాత్తు వారంతా కూడా ఎలాంటి పెను ప్రమాదం జరగలేదని వారంతా కూడా క్షేమంగా బయటపడినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే విమానాశ్రయంలో బోయింగ్ విమానం ల్యాండవుతుండగా అదుపు తప్పి రన్వేకి సమీపంలో ఉన్న సెయింట్ జాన్స్ నదిలో పడిపోయింది.

అయితే ఈ విమానం నదిలో మునగకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని,కొంతమందికి మాత్రం చిన్న చిన్న గాయాలయ్యాయని జాక్సన్విల్లే మేయర్ ప్రకటించారు.ఉదయం గంటల 9:40 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.

మరోపక్క ఈ ప్రమాదం తో హుటాహుటిన నావికా దళ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.అయితే విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు మాత్రం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే విమానం ఎలా రన్ వే నుంచి నదిలో పడింది అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube