ఫ్లెక్సీ పాలిటిక్స్ : ఆమంచి వర్సెస్ కరణం  

చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్పు గురించి గత కొద్ది రోజులుగా… అనేక ఊహాగానాలు… ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం దాదాపు ఖాయం అయిపొయింది అనుకుంటున్న సమయంలో చంద్రబాబు రాజకీయ చఁగతురత ఉపయోగించి మరీ కొంచెం మెత్తబడేలా చేసాడు. దీంతో ఈ అంశం తాత్కాలికంగా… వాయిదా పడింది అనుకుంటున్న సమయంలో చీరాలలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ కలకలం సృష్టిస్తోంది. ఈ మధ్యనే… ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. టీడీపీ గుడ్ బాయ్ చెప్పాలని డిసైడ్ అయ్యి వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే, ఆమంచితో చర్చలు జరిపిన మంత్రి శిద్దా రాఘవరావు ఆయనను బుజ్జగించారు.

Flexy Controversy In Chirala Politics-

Flexy Controversy In Chirala Politics

ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో ఆమంచి భేటీ అయ్యారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే విషయానికి బ్రేక్ పడింది. అయితే చీరాల రాజకీయాల్లోకి రావాలంటూ ఎమ్మెల్సీ కరణం బలరాంని ఆహ్వానిస్తూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. చీరాల ప్రధాన సెంటర్ అయిన రైల్వే స్టేషన్ ఎదుట భారీ ఫ్లెక్సీ కట్టారు. టీడీపీని నమ్మించి మోసం చేసిన నాయకులకు బుద్ది చెప్పేందుకు రావాలంటూ ఫ్లెక్సీపై రాసుకొచ్చారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఎమ్మెల్యే ఆమంచికి పొగ పెట్టడానికే ఎవరో కావాలని ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని … కొంతమంది చర్చించుకుంటున్నారు.