టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఓ యువకుడి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.ఫ్లెక్సీ పెట్టి ఆ ఎమ్మెల్యే పరువు తీశాడు.
కొందరు ఆ ఫ్లెక్సీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డిపై చేసిన ఈ ఫ్లెక్సీ ఫోస్ట్ సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది.
ఈ పోస్టును చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఎమ్మెల్యేకు గట్టి పంచ్ పడిందని, సింఫుల్ గా పరువు తీశావని, ఇలా విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ ఫ్లెక్సీలో ఏముందో తెలుసుకుందాం.ఎందుకంతలా వైరల్ అవుతుందో చూసేద్దాం రండీ.
ఆర్మూల్ మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద వర్షాకాలం కారణంగా రోడ్డు దారుణంగా మారింది.గుంతలు పడి నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.దీంతో స్థానిక బీజేపీ మద్దతుదారు విభిన్నంగా ఆలోచించారు.నియోజకవర్గంలో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
అందులో రోడ్డు గురించి, ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి గురించి విభిన్నంగా మాటలు రాసుకొచ్చారు.ఫ్లెక్సీలో ‘‘ ఇటీవలే రూ.3 కోట్లతో ఖరీదైన కారు కొన్న మా ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.ఆర్మూర్ ప్రజల కోసం కాకపోయినా తన ఖరీదైన కారు కోసమైనా రోడ్డు వేయించాలి’’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.