గులాబీ పార్టీలో ఫ్లెక్సీల ర‌గ‌డ‌... మ‌హామ‌హుల‌కే ఆ మంత్రి చెక్ త‌ప్ప‌ట్లేదా..!

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని అధికార పార్టీలో రాజ‌కీయం మామూలుగా వేడెక్క‌డం లేదు.ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో లెక్క‌లేన‌న్ని గ్రూపులు ఏర్పాట‌వుతున్నాయి.

 Flexi Fightings In Trs, Telangana,flexi Fightings, Municipal Corporation,ministe-TeluguStop.com

మంత్రి పువ్వాడ‌, ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి గ్రూపు కూడా యాక్టివ్ అవ్వ‌డంతో ఆధిపత్య రాజ‌కీయాల‌కు తెర‌లేచింది.ఇప్ప‌టికే మంత్రి పువ్వాడ‌, ఎంపీ నామా గ్రూపులు యాక్టివ్‌గా ఉండ‌డంతో చాప‌కింద నీరులా ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ర‌గ‌డ న‌డుస్తూనే ఉంది.

ఇక మాజీ మంత్రి తుమ్మ‌ల‌తో పాటు ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం అంతా స‌రైన టైం కోసం కాచుకుని ఉన్నారు.అయితే మాజీ ఎంపీ పొంగులేటితో పాటు ఆయ‌న అనుచ‌రులు ఇటీవ‌ల బాగా యాక్టివ్ అవుతున్నారు.

గ‌త రాజ్య‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ వ‌స్తుంద‌న్న హ‌డావిడి జ‌రిగినా రాలేదు.తాజాగా ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డంతో ఇప్పుడు గులాబీ పార్టీలో కొన్ని వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగుతోంది.

ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న అనుచ‌రులు ఖ‌మ్మం న‌గ‌ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే విజయదశమి పండుగ సందర్భంగా మంత్రి అజయ్ ఫ్లెక్సీలతో కూడా ఖమ్మం నగరం కళకళలాడింది.

అయితే కార్పొరేష‌న్ అధికారులు మంత్రి పువ్వాడ ఫ్లెక్సీల‌ను అలాగే ఉంచేసి.మాజీ ఎంపీ పొంగులేటి ఫ్లెక్సీలు అన్నింటిని తొల‌గించారు.

దీంతో ఖ‌మ్మం గులాబీ పార్టీలో మ‌రోసారి విబేధాలు తీవ్ర‌స్థాయిలో భ‌గ్గుమ‌న్నాయి.సెలవు రోజు కూడా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ ఈ ఫ్లెక్సీల‌ను తొల‌గించేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం వెన‌క మంత్రి పువ్వాడ హ‌స్తం ఉంద‌ని పొంగులేటి అనుచ‌రులు ఆరోపిస్తున్నారు.

అయితే అధికారులు మాత్రం అనుమ‌తులు ఉన్న ఫ్లెక్సీల‌ను ఉంచి.మిగిలిన వాటిని తీసేశామ‌ని చెపుతున్నారు.ఏదేమైనా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మంత్రి పువ్వాడ అజ‌య్ మిగిలిన వర్గాల‌న్నింటిని అణిచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని మిగిలిన నేత‌ల గ్రూపులు ఆరోపిస్తున్నాయి.ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌గ‌రంలో మంచి ప‌ట్టు ఉండ‌డంతో పాటు యాక్టివ్ అవుతోన్న అజ‌య్ వ‌ర్గాన్ని టార్గెట్ చేశార‌ని స్థానికంగా చెవులు కొరుక్కుంటోన్న ప‌రిస్థితి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube