మ‌ధుమేహం ముప్పు త‌గ్గించే అవిసె గింజ‌లు.. ఎలా తినాలంటే?  

మ‌ధుమేహం.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

TeluguStop.com - Flax Seeds Help To Get Rid Of Diabetes

ముఖ్యంగా ముప్పై ఏళ్ల‌కే మ‌ధుమేహం బారిన ప‌డుతున్న‌ వారు నేటి కాలంలో మ‌రీ ఎక్కువైపోతున్నారు.ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల మ‌ధుమేమం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఒక్క సారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే.జీవిత‌కాలం ఉంటుంది.

TeluguStop.com - మ‌ధుమేహం ముప్పు త‌గ్గించే అవిసె గింజ‌లు.. ఎలా తినాలంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాంతోజీవిత‌కాలంలో మందులు కూడా వాడాల్సి ఉంటుంది.అయితే మ‌ధుమేహం ముప్పు త‌గ్గించ‌డంలో అవిసె గింజ‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అవును, ప్ర‌తి రోజు అవిసె గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే పోష‌కాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.కాబ‌ట్టి, మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు అవిసె గింజ‌ల‌ను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఆవిసె గింజ‌లు ఎలా తీసుకోవాలి? అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంది.అవిసె గింజ‌ల‌ను పావు గంట పాటు నీటిలో నాన‌బెడితే.మొల‌క‌లు వ‌స్తాయి.ఆ మొల‌క‌ల‌ను ఉద‌యాన్నే తీసుకుంటే మంచిది.

మ‌ధుమేహం ఉన్న వారే కాదు.

సాధార‌ణ వ్య‌క్తులు కూడా వీటిని తీసుకుంటే డ‌యాబెటిస్ రాకుండా ఉంటుంది.ఇక అవిసె గింజ‌ల‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో అవిసె గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంతో పాటు మ‌ల‌బ‌ద్ధ‌కంను కూడా నివారిస్తుంది.అలాగే హెయిల్ ఫాల్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు అవిసె గింజ‌లు తీసుకుంటే.

అందులో ప్రోటీన్ శిరోజాల‌కు బ‌లాన్ని చేకూర్చి ఒత్తుగా ఎదిగేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

ఇక రెగ్యుల‌ర్‌గా అవిసె గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో క‌లెస్ట్రాల్ పెర‌గ‌కుండా చేయ‌డ‌మే కాదు.

ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా చేస్తుంది.ఫ‌లితంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉందొచ్చు.

అదేవిధంగా, అవిసె గింజ‌ల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉంటాయి.ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి.

కాబ‌ట్టి, అవిసె గింజ‌ల‌ను డైట్‌లో చేర్చుకోమ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

#Good Health #Health Tips #Flax Seeds #BenefitsOf #Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు