ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో విద్వంసంకి కుట్ర  

Flash Protests Held In Hyderabad Against Delhi Violence - Telugu Caa,, Lock Down, Nrc

పౌరసత్వ సవరణ చట్టం తర్వాత ఒక్కసారిగా దేశంలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ చట్టం ముస్లింలకి వ్యతిరేకంగా ఉందని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

 Flash Protests Held In Hyderabad Against Delhi Violence

అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో పర్యటించినపుడు హింసాత్మక ఘటనలకి పాల్పడి ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్ ని కూడా కొంత మంది ముస్లింలు అతి కిరాతకంగా చంపేశారు.ఇక ఈ అల్లర్లు దేశంలో ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.

ఢిల్లీలో జరిగినట్లు అల్లర్లను హైదరాబాద్‌లోనూ సృష్టించాలని కొందరు ప్లాన్ చేశారు.దానికోసం ఓ ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసక చర్యలకు కూడా ప్రయత్నించారు.

ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో విద్వంసంకి కుట్ర-General-Telugu-Telugu Tollywood Photo Image

ఓ బస్సుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు.పోలీసుల అప్రమత్తతతో వారి కుట్ర భగ్నం అయ్యింది.

హైదరాబాద్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన హర్షద్‌, బాబానగర్‌కు చెందిన అబ్దుల్‌ వసీ ఢిల్లీలో ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతున్నా అల్లర్ల వీడియోలను చూసి ఇక్కడ కూడా గొడవలు సృష్టించాలని ప్లాన్‌ చేశారు.మాదన్నపేట్‌ ప్రాంతంలో ఇటీవల ఓ వర్గానికి చెందిన ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసకర కుట్రకి సిద్ధమయ్యారు.

కంచన్‌బాగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుకు నిప్పంటించాలని చూశారు.పోలీసులు అప్రమత్తమై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా దాడులకు పాల్పడింది ఇద్దరే అని గుర్తించారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.వీరి వెనుక ఎవరున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అసలే కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ జరుగుతూ ఉండగా, మరో వైపు తెలుగు రాష్ట్రాలలో మర్కజ్ ముస్లిం ప్రార్ధనలలో పాల్గొన్న వారి కారణంగా కరోనా కేసులు ఎక్కువ అయినట్లు ఆధారాలు లచించిన సమయంలో ఈ ఘటన సంచలనంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Flash Protests Held In Hyderabad Against Delhi Violence Related Telugu News,Photos/Pics,Images..