వైరల్ వీడియో.. వరదలో అగ్గిపెట్టల్లా కొట్టుకుపోతున్న కార్లు!

ఒక వైపు కరోనా విలయ తాండవం సృష్టిస్తుంటే.మరొక వైపు వర్షాలు బీభత్సము సృష్టిస్తున్నాయి.

 Flash Floods In Dharamshala City Heavy Rainfall Wreaks Havoc In Bhagsu Nag, Hima-TeluguStop.com

వర్షాలు కారణంగా రోడ్లు నదుల్లా ప్రవహిస్తున్నాయి.ధర్మశాలలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, చెట్లు వర్షపు నీళ్ళల్లో మునిగిపోయి బీభత్సము సృష్టిస్తున్నాయి.

కొండా ప్రాంతం కావడం వల్ల వరద నీరు వేగంగా రావడంతో అక్కడ ఉన్న కార్లు ఆ వరద నీటిలో కొట్టుకు పోతున్నాయి.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో టూరిస్టులు వచ్చి పోతూ ఉన్నారు.కానీ ఈ వర్షాలు కారణంగా టూరిస్టులు ఆ వరదల్లో చిక్కుకుని అల్లాడి పోతున్నారు.

ఎటు కదలడానికి లేక విలవిల లాడుతున్నారు.అయితే ఈ వర్షాలు ఇంకా తగ్గలేదని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలుపుతున్నారు.

ఈ వర్షాలు కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచి పోయారు.రహదారి మార్గాలు కూడా స్తంభించి పోవడంతో టూరిస్టులు మరి కొద్ది రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది.

ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు కారణం గా వరదలు వస్తున్న నేపథ్యంలో ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడం తో ప్రజలు భయపడి పోతున్నారు.

కేవలం ధర్మశాలలో మాత్రమే కాదు.హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి.భారీ వర్షాలు కారణంగా జనజీవనం అస్తవ్యస్త మవుతుంది.

ఈ వరదలకు సంబంధించి కొన్ని వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి.కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి.

పోస్ట్ చేస్తూ వరదల్లో చిక్కుకున్న టూరిస్టులకు, స్థానికులకు సహాయ సహకారాలు అందించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

ఇప్పటికే వరదలు బీభత్సం సృష్టిస్తుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని ప్రజలు భయ పడుతున్నారు.ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు ‘ఆరెంజ్’ వార్ణింగ్ ఇచ్చారు.చూడాలి రానున్న రోజుల్లో వర్షాలు ఇంకా ఎన్ని బీభత్సాలు సృష్టిస్తాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube