13 అడుగుల భారీ మొసలి కడుపులో బయటపడ్డ 5 వేల ఏళ్ళ నాటి బాణం.. !?

ప్రపంచంలో రోజు ఏవో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి.అయితే సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ వింతలు విశేషాలు జరిగినా క్షణాల్లో వైరల్ గా మారి అందరికీ తెలిసిపోతుంది.

 Five Thousand Years Old Arrow Found In 13 Feet Crocodile Details-TeluguStop.com

ఇప్పుడు కూడా ఓ వింత సంఘటన జరిగింది.ఓ 13 అడుగుల భారీ మొసలి కడుపులో 5000 ఏళ్ళ నాటి బాణం బయటపడిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.

షేన్ స్మిత్ అనే వేటగాడు తన వృత్తిలో భాగంగా పెద్ద పెద్ద జంతువులను వేటాడుతూ ఉండేవాడు.అయితే ఓ రోజు తాను వేటాడుతున్న సమయంలో భారీ ముసలి అతను వలకి చిక్కింది.

 Five Thousand Years Old Arrow Found In 13 Feet Crocodile Details-13 అడుగుల భారీ మొసలి కడుపులో బయటపడ్డ 5 వేల ఏళ్ళ నాటి బాణం.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది గమనించిన వేటగాడు మొదట ఆశ్చర్యపోయాడు.తర్వాత మొసలి కడుపులో బాణం ఉండటాన్ని గమనించి తన మిత్రుడైన ఆర్కియాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాడు.13 అడుగుల మొసలిని పరీక్షించిన ఆర్కియాలజిస్ట్ షెన్ ఆ ముసలి బాణాన్ని మింగినట్లు ఊహించాడు.వెంటనే ముసలి కడుపులో ఉన్న ఆ బాణాన్ని పరీక్షించి ఇది సుమారు ఐదు వేల ఏళ్ల నుంచి 6 వేల సంవత్సరాల నాటి బాణంగా గుర్తించాడు.

ఇంకా ఆ ముసలి కడుపులో బాణమే కాకుండా చేపల ఎముకలు, పక్షి ఈకలు, బంతులు, మొదలైనవి కూడా ఉన్నట్లు గుర్తించారు.

Telugu 13 Feet, 13 Feet Crocodile Details, 5 Years, Crocodile, Five Thousand Years Old Arrow, Hunter Shane Smith, Latest News, Old Coin, Strange Incident, Viral Latest, Viral News-Latest News - Telugu

స్థానిక అమెరికన్లు ఫిషింగ్ కోసం బాణాలు, ఫ్లూమ్ లను ఉపయోగించేవారు.కాబట్టి అలా అమెరికన్లు విసిరేసిన వస్తువులను ఆ ముసలి మింగి ఉంటుందని, అలాగే ఓ వేటగాడు విసిరిన బాణానికి గాయపడిన ఓ చేపను ఈ ముసలి తినేసి ఉండడం తో దాని కడుపులో బాణాలు, చేపల ఎముకలు ఉన్నాయని అంచనా వేశారు.ముసలి కడుపులో బయటపడ్డ బాణం పైన పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి.

షెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఫేస్ బుక్ లో ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ముసలి చిత్రాన్ని కూడా షేర్ చేశారు.

#Strange #Crocodile #Thousand Arrow #FeetCrocodile #Feet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube