అమెరికా అధ్యక్షుడిని డిసైడ్ చేసిది ఈ రాష్ట్రాలే..!!!  

Five States Decides America President, White House, Joe Biden, Donald trump, America, Presidential Elections, November 3rd - Telugu America, Donald Trump, Five States Decides America President, Joe Biden, November 3rd, Presidential Elections, White House

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయ్యింది.కేవలం మరో 6 రోజుల వ్యవధిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

TeluguStop.com - Five States Decides America President Elections

ఇప్పటికే ఎర్లీ ఓటింగ్ ద్వారా కోట్లాది మంది ఓట్లు వేస్తున్నారు.గతంలో లేనంతగా భారీ స్థాయిలో పోలింగ్ నమోదవుతోందని పరిశీలకులు అంటున్నారు.

ఈ సారి కూడా అధికారంలోకి తానే వస్తానని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే, ట్రంప్ ఓటమి ఖాయమని, డెమోక్రటిక్ పార్టీ అమెరికన్స్ , వలస దారుల మద్దతుతో అధ్యధిక మెజారిటీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు బిడెన్.ఇదిలాఉంటే

TeluguStop.com - అమెరికా అధ్యక్షుడిని డిసైడ్ చేసిది ఈ రాష్ట్రాలే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఏ పార్టీ ఎలాంటి ధీమా వ్యక్తం చేసినా, ఏ రాష్ట్రంలో ఎంత బలం ఉన్నా అమెరికా వ్యాప్తంగా ఉన్న 50 రాష్ట్రాలలో కేవలం 14 రాష్ట్రాలలో ఏ పార్టీ కి అత్యధిక ప్రజాదరణ ఉంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని అంటున్నారు.

గత ఎన్నికల్లో కూడా హిల్లరీ ముందంజలో ఉందనుకున్న తరుణంలో ఊహించని విధంగా ట్రంప్ అధికారాన్ని చేపట్టాడంటే అందుకు ప్రధాన కారణం ఈ రాష్ట్రాలే.మరి అధ్యక్షుడిని డిసైడ్ చేసే రాష్ట్రాలు ఏమిటి.

వీటిపై అభ్యర్ధుల బలం ఏ స్థాయిలో ఉందొ ఓ సారి పరిశీలిద్దాం.

అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాలు ఉంటే డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరాల్ కాలేజ్ ఓట్లు ఉంటాయి.

మొత్తం 538 ఎలక్టోరాల్ కాలేజీ ఓట్లు ఉండగా వాటిలో 270 ఓట్లు సాధించిన వాళ్ళే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.టెక్సాస్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఒహియో, మిషిగాన్, జార్జిగా, నార్త్ కరోలినా, వర్జీనియా, అరోజోనా, విస్కాన్సన్, నెవాడా, మిన్నేసోటా, అయోవా, న్యూ హ్యంప్ షైర్, ఈ రాష్ట్రాలలో మొత్తం అన్ని కలిపి ఎలక్టోరాల్ ఓట్లు 200 పై చీలుకే ఉంటాయి.

ఈ ప్రాంతాలే అధ్యక్షుడి తలరాతని డిసైడ్ చేస్తాయి.గతంలో ట్రంప్ కి అధికారం కట్టబెట్టిన ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఎవరికీ అధికారాన్ని అప్పగిస్తాయో అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు పరిశీలకులు.

వీటిలో దాదాపు 5 రాష్ట్రాలు ట్రంప్ కి అనుకూలంగా ఉన్నాయని మిగిలిన వాటిలో బిడెన్ హవా ఉంటుందని అంటున్నాయి సర్వేలు అయితే బిడెన్ ఇప్పుడు ట్రంప్ కి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ కూడా పట్టుపెంచుకునే పనిలో పడ్డాడని తెలుస్తోంది.ఇప్పటికే అత్యధికంగా ఆ రాష్ట్రలపై డాలర్ల వర్షం కురిపిస్తున్నాడట బిడెన్.

ఒక వేళ ఆ రాష్ట్రాలు గనుకా బిడెన్ కు అనుకూలంగా మారితే ట్రంప్ ఓటమి ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

#November 3rd #America #Joe Biden #Donald Trump #White House

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Five States Decides America President Elections Related Telugu News,Photos/Pics,Images..