మంత్ర ముగ్ధుల్ని చేసే ఐదు శివలింగాల దర్శనం అద్భుతం.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా?

మనదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి.ఈ శివాలయాలలో ఎక్కువ భాగం మనకు శివడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.

 Five Shivalingas Of All Devotees Spread All Over The India-TeluguStop.com

ఈ విధంగా వెలసిన శివలింగానికి ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.అయితే మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఐదు శివలింగాలు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.మరి ఆ అయిదు శివలింగాలు ఏవి? వాటి విశిష్టత ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

అమర్ నాథ్ దేవాలయం:

మన దేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో అమర్ నాథ్ ఆలయం ఒకటి.ఈ ఆలయంలో సంవత్సరంలో ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే శివలింగం మనకు దర్శనమిస్తుంది.ఈ ఆలయం వేసవికాలంలో తప్ప మిగతా సమయాలలో మంచుతో కప్పబడి ఉంటుంది.అందుకోసమే ఈ ఆలయాన్ని దర్శించడం కోసం వేసవిలో ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడికి తరలి వస్తారు.ఇక్కడ శివలింగం స్వయంగా మంచుగడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది.

 Five Shivalingas Of All Devotees Spread All Over The India-మంత్ర ముగ్ధుల్ని చేసే ఐదు శివలింగాల దర్శనం అద్భుతం.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నర్మదా నదీ తీరం వద్ద ఉన్న శివలింగం:

Telugu Amarnath Shiva Lingam, Brihadeeswara Temple, Bruhadeeswara Lingam, Kedareshwara Temple, Kedareswara Lingam, Mukha Lingam, Narmada River, Narmada River Shiva Lingam, Shiva Lingas-Telugu Bhakthi

మధ్యప్రదేశ్ లో వున్న మహేశ్వర్ లో నర్మదా నదిలో ప్రతిష్టించబడివున్న ఈ శివలింగం అత్యంత అద్భుతమైనది.ఈ శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.పురుషుడు మరియు ప్రకృతి సమాగమనాన్ని సూచించే ఈ శివలింగం అత్యంత పవిత్రమైనది.నర్మదా నదిలో స్నానమాచరించి ఇక్కడ వెలసిన శివ లింగాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

బృహదీశ్వరాలయం:

Telugu Amarnath Shiva Lingam, Brihadeeswara Temple, Bruhadeeswara Lingam, Kedareshwara Temple, Kedareswara Lingam, Mukha Lingam, Narmada River, Narmada River Shiva Lingam, Shiva Lingas-Telugu Bhakthi

తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఒకటి.ఈ ఆలయంలో పరమశివుడు ఏకశిలతో నిర్మితమై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

కేదారేశ్వర దేవాలయం:

Telugu Amarnath Shiva Lingam, Brihadeeswara Temple, Bruhadeeswara Lingam, Kedareshwara Temple, Kedareswara Lingam, Mukha Lingam, Narmada River, Narmada River Shiva Lingam, Shiva Lingas-Telugu Bhakthi

మహారాష్ట్రలోని హరిశ్చంద్రఘడ్ లో వున్న కేదారేశ్వర దేవాలయంలో అత్యంత మహిమాన్వితమైన దేవాలయం.ఈ ఆలయం నీటిలో శివలింగం కొలువై ఉండి ఈ ఆలయం నాలుగు స్తంభాలతో నిర్మితమై ఉంది.ఈ నాలుగు స్తంభాలను నాలుగు యుగాలుగా భావించారు.ఇప్పటికే మూడు స్తంభాలు విరిగిపోయినప్పటికి కేవలం ఒక స్థంభంపై మాత్రమే ఆలయం ఆధారపడి ఉంది.ఈ స్తంభం కూడా విరిగిపోతే యుగాంతం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు.

ముఖలింగం:

Telugu Amarnath Shiva Lingam, Brihadeeswara Temple, Bruhadeeswara Lingam, Kedareshwara Temple, Kedareswara Lingam, Mukha Lingam, Narmada River, Narmada River Shiva Lingam, Shiva Lingas-Telugu Bhakthi

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలోని ఉదయగిరి గుహలో అత్యంత అరుదైన శివలింగం ఉంది.ఈ శివలింగం ఒక ఆకారాన్ని కలిగి ఉండటం వల్ల దీనిని ముఖలింగం అని పిలుస్తారు.ఈ విధంగా మనదేశంలో ఎన్నో శివాలయాలు ఉండగా ఈ శివలింగాలు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.

#Narmada River #Mukha Lingam #NarmadaRiver #AmarnathShiva #Shiva Lingas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU