భూమి కింద ప్రవహిస్తున్న ఐదు నదులు.. అవి ఎక్కడ ఉన్నాయంటే?

భూమిలో నదులు ఉండటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి భూమికింద నదులు ప్రవహిస్తున్నాయట.మరి ఆ నదులేమిటి? ఎక్కడున్నాయో తెలుసుకుందామా? భూమికింద ప్రవహిస్తున్న నదుల్లో ఒకటి లాబూయిచ్ నది. ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది.ఐరోపాలోనే ఇది అతి పొడవైన భూగర్భ నది.దీనిని 1906లో మొదటిసారి కనుక్కున్నారు.ప్రతీ సంవత్సరం ఎప్రిల్ నుంచి నవంబరు మధ్యలో దీనిని చూసేందుకు పర్యాటకు వస్తుంటారు.

 Five Rivers Flowing Underground Where Are They , Five Rivers, Viral News-TeluguStop.com

పర్యాటలకు దీనిని చూసేందుకు వస్తుంటారు.ఈ నదికి సంబంధించి ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లొచ్చు.

మరో భూగర్భనది పేరు ‘ మిస్టరీ రివర్’.ఇది అమెరికాలోని ఇండియానాలో ఉంది.ఇది అమెరికాలో పొడవైన భూగర్భనది.మొదట్లో దీనికి చూసేందుకు అందరికీ పర్మిషన్ ఉండేది కాదు.కొంత మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చేది అక్కడి ప్రభుత్వం.కానీ దీనిని చూసేందుకు 1940 నుంచి అందరికీ పర్మిషన్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

ఇలాంటి నదే ఫిలిప్పీన్స్‌లో ఉంది.దాని పేరు ప్యూర్టో ప్రిన్సిసా.యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.ఈ నది సుమారు ఐదుమైళ్ల పొడవుంటుంది.

ఈ నది భూమి కిందున్న గుహల్లో ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది.దీనికి చూసేందుకు పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తారు.

రోజుకు కేవలం 600 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు.ఇక భూమిలో ప్రవహించే మరో నది పేరు శాంటాఫే.

ఇది అమెరికా లోని ఫ్లోరిడా ప్రాంతంలో ఉంది.ఇది సుమారు 121 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

ఇది 5 కిలోమీటర్ల మేర భూగర్భంలో ప్రవహిస్తూ ఉంటుంది.ఇక ఐదవ నది ప్యూర్టోరికో ప్రాంతంలో ఉంది.

దీని పేరు రియో కామునది.ఇది సుమారు మిలియన్ ఏండ్ల పురాతన గుహలగుండా వెళ్తున్నది.

ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద భూగర్భ నది అని చెబుతుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube