నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడానికి ఐదు కారణాలు ఇవే?

సైదాబాద్ చిన్నారి హత్య, హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు నిన్న ఉదయం 8.45 గంటలకు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.చిన్నారి ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు ఉప్పల్, ఎల్బీ నగర్ ఏరియాలలో సంచరించాడు.ఆటోలు, లారీలలో ప్రయాణం చేసి స్టేషన్ ఘన్ పూర్ కు చేరుకున్నాడు.

 Five Reasons About  Saidabad Incident Raju Suicide Details, Five Reasons, Intere-TeluguStop.com

ఒత్తిడి, భయం వల్లే ప్రధానంగా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

చిన్నారిని హత్య చేసిన తర్వాత నెటిజన్ల నుంచి, సెలబ్రిటీల నుంచి వ్యక్తమైన విమర్శలు రాజు దృష్టికి రావడంతో ప్రజల చేతికి దొరికితే ప్రాణాలతో బయటపడటం కష్టమని అతనికి అర్థమైంది.

ఆ భయం రాజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది.రాజు సెల్ ఫోన్ వాడకపోవడం వల్ల పోలీసులకు నిందితుడిని పట్టుకోవడం కష్టమైంది.

అయితే అతనిని పట్టిస్తే ఏకంగా 10 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

ఎవరైనా తనను గుర్తుపడితే పోలీసులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే భయం కూడా రాజు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమని చెప్పవచ్చు.

Telugu Chitra, Janagama, Railway Track, Raju, Rapist Raju, Saidabad, Uppal-Lates

జనగామ జిల్లాలోని సొంతూరుకు రాజు వెళ్లాలని ప్రయత్నించినా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడటం కూడా రాజు ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణమని చెప్పవచ్చు.పోలీసులు రాజు వేషం మార్చితే ఏ విధంగా ఉంటాడో కూడా ఫోటోలు రిలీజ్ చేయడం, తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేసినా లాభం లేదని అర్థమై రాజు సూసైడ్ చేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.

Telugu Chitra, Janagama, Railway Track, Raju, Rapist Raju, Saidabad, Uppal-Lates

ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో సమాజం నుంచి వ్యతిరేకత ఉండటంతో పాటు తన స్నేహితులు, బంధుమిత్రుల నుంచి కూడా సహాయసహకారాలు లభించవని రాజుకు అర్థమైంది.ఎవరికి దొరికినా తనకు ఘోరమైన చావు తప్పదని భావించి నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.భవిష్యత్తులో సైదాచాద్ చిన్నారి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల్లో మార్పులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube