ఖగోళ వింత: ఆకాశంలో పంచ గ్రహ కూటమి... నేరుగా కళ్లారా చూడొచ్చు...!

పురాణాల నుండి మనం చెప్పుకున్నట్టుగా నవగ్రహాల్లో ఒక గ్రహం మన భూమి కూడా.అయితే ఇటీవల కాలంలో ఓ గ్రహాన్ని మరుగుజ్జు గ్రహం గా తెలచడంతో దాంతో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి అని అన్నారు శాస్త్రజ్ఞులు.

 Five Planets Were Visible With Naked Eyes, Five Planets,sky, Mercury, Venus, Mar-TeluguStop.com

దీంతో తాజాగా మనకి కేవలం ఎనిమిది గ్రహాలు మాత్రమే అని చెప్పుకుంటున్నాం.ఈ ఎనిమిది గ్రహాల్లో రెండు లేదా మూడు గ్రహాలు ఎప్పుడు ఆకాశంలో మన కంటికి డైరెక్ట్ గానే కనబడుతుంటాయి.

కాకపోతే అవి గ్రహాలని మనలో చాలా మంది కి తెలియదు కూడా.వాటిని చూసిన కూడా అచ్చం నక్షత్రాలలా ఉంటాయి మరి.దానికి కారణం అవి మెరుస్తూ ఉండడమే.

ఇకపోతే తాజాగా ఖగోళశాస్త్రవేత్తలు ఈ వారంలో ఏకంగా ఐదు గ్రహాలను భూమిపై నుండి నేరుగా కళ్లతో చూసే విధంగా కనపడతాయని చెబుతున్నారు.

నిజానికి ఇలాంటి సంఘటన చూడగలగడం నిజంగా అసాధారణ విషయమే.ఎందుకంటే ఇలా వచ్చే సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ.సైంటిస్టుల అంచనాప్రకారం ఈ ఐదు గ్రహాలు ప్రపంచంలోని అన్ని దేశాలు చూడగలమని చెబుతున్నారు.

ఇక ఈ అద్భుత దృశ్యం సాయంత్రం సూర్యాస్తమయం సమయం నుండి సూర్యోదయం లోపు జులై 19 నుండి జులై 25 వరకు ఈ ఐదు గ్రహాలు మన కంటికి కనిపించబోతున్నాయి.

అయితే గ్రహాలు ఏవో తెలియకుండానే చూసేద్దాం అనుకుంటున్నారా….? అవేనండీ బుధగ్రహం, శుక్ర గ్రహం, అంగారక గ్రహం, గురు గ్రహం, శని గ్రహలు నేరుగా మన కంటి కి కనబడపోతున్నాయి.ఇక ఇందులో గురు గ్రహం, శని గ్రహం పక్కపక్కనే ఉంటాయి.గురుగ్రహం చాలా పెద్దగా మెరుస్తూ కనపడుతుంది.ఈ రెండు గ్రహాల కు ఎడమ వైపు కొద్ది దూరంలో నారింజ రంగులో మెరుస్తూ అంగారకగ్రహం కనబడుతుంది.ఈ మూడు గ్రహాలు రాత్రివేళల్లో కాస్త మెరుస్తూ కనపడతాయి.

అలాగే శుక్రగ్రహం అత్యంత కాంతివంతంగా మెరుస్తూ కనబడుతుంది.అయితే బుధగ్రహం మాత్రం చాలా చిన్నగా తక్కువ కాంతి ఉండడంతో సరిగా గమనించాలని చెబుతున్నారు సైంటిస్టులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube