వామ్మో.. తమన్నాకు ఒకే రోజు 5 మంది ప్రపోజ్.. ఆ తర్వాత?

అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఎవరైనా ప్రపోజ్ చేయకుండా ఉండరు.అలాంటిది ఏకంగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు కనిపిస్తే మాత్రం వీరి ప్రపోజల్స్ లిస్ట్ పెద్దగానే ఉంటుంది.

 Five People Proposed Tamanna In One Day Do You Know What Happened,  Tamannah , H-TeluguStop.com

ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్ లను బయట వాళ్ళే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా చాలా మంది ప్రపోజ్ చేశారు.ఇక మిల్కీ బ్యూటీ తమన్నాకు ఏకంగా ఒక్క రోజే ఐదు మంది ప్రపోజ్ చేశారట.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా కి ఉన్న క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి.తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళనే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను కూడా ఫిదా చేసింది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల దృష్టిలో పడి వారి సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.

తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా.అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ఇంత అందంగా ఉండే తమన్నాకు ఎన్నో ప్రపోజల్స్ కూడా వచ్చాయి.

Telugu Ajay Devgan, Bollywood, Sajid Khan, Tamanna, Day, Tamannah, Tollwood-Movi

మామూలుగా ఎవరికైనా ఏదో అప్పుడప్పుడు ప్రపోజల్స్ ఎదురవుతాయి.కానీ తమన్నాకు ఏకంగా ఒక్కరోజే ఐదుగురు ప్రపోజ్ చేశారట.గతంలో తాను బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒకరోజు ఆ సినిమా షూటింగ్ సమయంలో ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి తనతో పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేశారట.

Telugu Ajay Devgan, Bollywood, Sajid Khan, Tamanna, Day, Tamannah, Tollwood-Movi

దాంతో ఒకేరోజు ఐదుగురు వచ్చి తనను ప్రపోజ్ చేయడంతో షాక్ అయిందట తమన్నా.కానీ ఇలా ఒకే రోజు ఇంతమంది ప్రపోజ్ చేయడం వెనుక ఆ సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ ఉన్నాడని తెలిసింది.కావాలనే తాను తమన్నాను ఆటపట్టించడం కోసం ఇక ప్లాన్ చేసినట్లు తెలియడంతో తమన్నా బాగా నవ్వుకుందని తెలిసింది.

Telugu Ajay Devgan, Bollywood, Sajid Khan, Tamanna, Day, Tamannah, Tollwood-Movi

నిజానికి ఈ అమ్మడు అందానికి ఎవరు పంపించకున్నా సరే తమంతట తామే వచ్చి ప్రపోజ్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు.అటువంటి అందంతో పాలరాతి బొమ్మ గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రపోజల్స్ రాలేవంటనే షాక్ అవ్వాలి తప్ప ప్రపోజల్స్ వచ్చాయి అంటే అసలు షాక్ అవ్వకూడదు.ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా గుర్తుందా శీతాకాలంలో బిజీగా ఉంది.మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube