లూసియానాలో కుప్పకూలిన బుల్లి విమానం: ఐదుగురు దుర్మరణం

అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి.గురువారం హవాయి తీరంలో పర్యాటక హెలికాఫ్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం పాలైన సంగతి మరచిపోకముందే లూసియానా రాష్ట్రంలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

 Five People Died In A Small Plane Crash Near Louisiana-TeluguStop.com

వివరాల్లోకి వెళితే… కళాశాల స్థాయి ఫుట్‌బాల్ ప్లే ఆఫ్ సెమీఫైనల్ కోసం ఎనిమిది మంది చిన్న విమానంలో అట్లాంటాకు వెళుతున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం లాఫెయెట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని వాల్‌మార్ట్ లైనులో ఫ్లైట్ కూలిపోయింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు.

మరణించిన వారి వివరాలు:

* ఇయాన్ ఈ బిగ్స్, 51 (పైలట్)
* రాబర్ట్ వాఘన్ క్రిస్ప్ II, 59
* కార్లే ఆన్ మెక్ కార్డ్, 30 (స్పోర్ట్స్ రిపోర్టర్)
* గ్రెట్చెన్ డి.విన్సెంట్, 51
* మైఖేల్ వాకర్ విన్సెంట్, 15

Telugu Louisiana-

గాయపడిన ప్రయాణికుడిని స్టీఫెన్ వాడే బెర్జాస్‌ 37గా గుర్తించారు.ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉన్నట్లు లాఫాయెట్ అగ్నిమాపక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.కాగా ఈ ఘటనలో.

విమాన శకలాలు తగిలడంతో పాటు పొగపీల్చి అక్కడికి దగ్గరలో కారులో ఉన్న ఓ వ్యక్తి, పోస్టాఫిసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు.ప్రమాదానికి గురైన ఫ్లైట్‌ను పీఏ-31టీగా గుర్తించారు.

విమాన ప్రమాదంపై ఎఫ్ఏఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.లాఫాయెట్ ప్రాంతంలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగానే విమానం కూలిపోయి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube