సుప్రీం తలుపుతట్టిన మరో 5 గురు ఎమ్మెల్యేలు, ఏమి జరుగుతుందో

ఇటీవల కర్ణాటక లో రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే.సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్-జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు 14 మంది తమ రాజీనామాలు సమర్పించడం,వాటిలో 8 మంది లేఖలో సరైన ఫార్మాట్ లో లేవంటూ స్పీకర్ రమేష్ ఆమోదించకపోవడం ఇలా వరుస ఘటనలతో అక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

మరోపక్క అసలు సీఎం గా కుమార స్వామి వద్దు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్న ఈ సమయంలో సీఎం గారు బలనిరూపణ కు సిద్ధమంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించడం ఇలా ఒక్కొక్క అంశం తో అక్కడ రాజకీయాలపై మరింత ఆసక్తి పెరుగుతుంది.ఎప్పడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో పెరిగిపోతుంది.

అయితే ఇదిలా ఉండగా, ఇప్పుడు తాజాగా మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తలుపుతట్టినట్లు తెలుస్తుంది.తాము స్వచ్ఛందంగా రాజీనామాలు ఇస్తే స్పీకర్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని మొదట సుప్రీంను అసమ్మతి ఎమ్మెలీలు ఆశ్రయించగా దీనిపై విచారించిన సుప్రీం కోర్టు రెబల్స్ అందరూ కూడా స్పీకర్ ఎదుట హాజరుకావాలి అంటూ అల్టిమేటం జారీ చేసింది.

ఈ క్రమంలో 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు సరైన ఫార్మాట్ లో లేవని వాటిని నిశితంగా పరిశీలించి వారితో మాట్లాడిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటాను అని స్పీకర్ వెల్లడించారు.

-Telugu Political News

అయితే ఆ పదిమందికి తోడు తాజాగా మరో 5 గురు ఎమ్మెల్యే లు సుప్రీం తలుపుతట్టారు.తమ రాజీనామాలను ఆమోదించేలా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు రెబల్ ఎమ్మెల్యేలు.తాజాగా అత్యున్నతన్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు సుధాకర్, రోషన్, నాగరాజు, మునిరత్నం కూడా ఉన్నారు.

దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది.రామలింగారెడ్డి మినహా రెబల్ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube