పౌరసత్వ సవరణ ఆందోళన... సౌదీలో ఐదుగురు ప్రవాసీ బారతీయులు అరెస్ట్  

Five Indians Arrested In Saudi Controversy Against Nrc-caa,citizenship Bill,controversy Against Nrc,five Indians Arrested In Saudi,kerala

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.మరో వైపు విదేశాలలో ఉన్న భారతీయ ముస్లిం, మైనార్టీలు కూడా ఈ పౌరసత్వ సవరణ బిల్లుపై తమదైన పద్దతిలో ఆందోళన తెలిపుతున్నాయి.

Five Indians Arrested In Saudi Controversy Against Nrc-Caa Citizenship Bill Controversy Nrc Five Kerala

ఎక్కువగా కేరళా రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడ ఉంటే అక్కడ పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.ఇక ఈ బిల్లుపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మద్దతు కూడా అదే స్థాయిలో ఉంది.

ముఖ్యంగా బీజేపీ మద్దతు ఇచ్చే సంఘాలు, హిందుత్వ సంస్థలు పౌరసత్వ బిల్లుకి మద్దతు తెలుపుతున్నాయి.ఇక తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై సదస్సు నిర్వహించినందుకు సౌదీ అరేబియాలో ఐదు మంది ప్రవాసీ బారతీయులని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పుడు ఈ వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది.

రియాద్ నగరంలోని మాలాజ్ అనే ప్రాంతంలో ఒక హోటల్ ఆడిటోరియంలో భారతీయ పౌరసత్వ సవరణ చట్టం-మిధ్య అన్వేషణ అనే అంశం మీద అంశంపై సంఘ్ పరివార్ సంబందించిన ప్రవాసీ భారతీయుల సంఘం సదస్సు నిర్వహించడం జరిగింది.

ఇందులో పాల్గొన్న అందరూ కేరళ రాష్ట్రానికి చెందిన వారే.సదస్సు ముగిసిన తర్వాత కొందరు మలయాళీలు సదస్సు జరిగే ప్రాంతంలో దానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం చేశారు.

దీనిపై పోలీసులకి సమాచారం చేయడంతో వారు హోటల్ కి వచ్చి ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన వారిని విడిపించేందుకు రెండు రోజులుగా భారతీయ ఎంబసీ అధికారులు అక్కడి పోలీసుల చుట్టూ తిరిగుతున్న సౌదీ అధికారులు మాత్రం వారిని అనుమతించడం లేదని తెలుస్తుంది.

తాజా వార్తలు